పద్మశాలి టెలిఫోన్ డైరెక్టరీ ఆవిష్కరణ
Published Mon, Aug 22 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
నల్లగొండ టౌన్ : పద్మశాలి టెలిఫోన్ డైరెక్టరీని ఆదివారం పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిప్రోలు వెంకటపతి పట్టణ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీయుల మొబైల్ నంబర్లతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించి టెలిఫోన్ డైరెక్టరీని రూపొందించడం అభినందనీయమన్నారు. డైరెక్టరీ రూపకర్త ఎస్.రమేశ్ మాట్లాడుతూ డైరెక్టరీని ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీకి అంకితమిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు చిలువేరు చంద్రయ్య, మిర్యాల సోమయ్య, గంజి భిక్షమయ్య, దుడుకు లక్ష్మీనారాయణ, టి.సంతోశ్, ఎం.వెంకటయ్య, ఎ.గిరీశ్, పి.వీరేశ్ పి.వెంకటయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement