రాజీనామా చేయించి..గెలవండి
రాజీనామా చేయించి..గెలవండి
Published Mon, Aug 8 2016 11:52 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
– నాయకులు వెళ్లినా..జగన్ వెంటే జనం
– టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారు
– వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి
కర్నూలు(టౌన్): దమ్ము, ధైర్యం ఉంటే ప్రలోభాలతో టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి సవాల్ విసిరారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి అచ్చెన్నాయుడు 2019 కల్లా వైఎస్‌ఆర్‌సీ ఖాళీ అవుతుందంటూ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వలస ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళితే ఎవరిబలమెంతో తేలిపోతుందన్నారు. నాయకులు వెళ్లినా ప్రజలంతా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంట ఉన్నారన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో ఒక్క హామీ నెరవేరలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయామన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు.
టీడీపీకి రాబోయేవి గడ్డురోజులు..
తాను 22 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. జిల్లా అధ్యక్షునిగా పనిచేశానని.. వ్యక్తుల వల్ల, వ్యతిరేకత వల్ల పార్టీ మారలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు బి.వై. రామయ్య స్పష్టం చేశారు. జగన్ వెంట జనం ఉన్నారని, తనకు సరైన వేదిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అని చేరినట్లు చెప్పారు. పార్టీ గుర్తుతో గెలిచి ప్రజలను కాదని, సొంత ప్రయోజనాల కోసం టీడీపీ చెంత చేరిన వారు రాజీనామా చేయాలన్నారు. టీడీపీకీ రాబోయేవి గడ్డురోజులన్నారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
పుష్కర పనుల్లో అవినీతి..
కష్ణా పుష్కారాల పేరుతో అ«ధికార పార్టీ నాయకులు కోట్లు దండుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును పర్సంటేజీల రూపంలో వసూలు చేసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. జిల్లాలో పాలన అదుపు తప్పిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జీ హఫీజ్‌ఖాన్ అన్నారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సత్తా చాటుతుందన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు మద్దయ్య, మహిళా కన్వీనర్ విజయకుమారి, నగర నాయకులు రమణ, తోట వెంకటకష్ణా రెడ్డి, బుజ్జి పాల్గొన్నారు.
Advertisement
Advertisement