
హ్యాపీ బర్త్‌డే సార్
వైఎస్.జగన్‌కు పార్టీ నేతల ముందస్తు శుభాకాంక్షలు
ద్వారకానగర్: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ నాయకులు ముందస్తు జన్మదినోత్సవ శుభాకాకంక్షలు తెలిపారు. ఈ నెత 21న ఆయన జన్మదినోత్సవం. దానికి రెండు రోజుల ముందు సోమవారం విజయనగరం పర్యటనకు వెళ్లిన ఆయన అదే రాత్రి 11.15 గంటలకు తిరిగి విశాఖ చేరుకున్నారు. ఆయన బస చేసిన సర్క్యూట్ హౌస్ వద్దకు పార్టీ నాయ కులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొందరు కేక్ తీసుకొచ్చి ఆయన చేత కట్ చేయించి శుభాకాంక్షలు చెప్పారు.