
నేడు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరంతో సహా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ముందస్తు శుభాకాంక్షలు: వైఎస్ జగన్ కు వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, మహ్మద్ ముస్తఫా, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో సహా పలువురు నేతలు ముందు రోజే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.