చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణాలు
చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణాలు
Published Mon, Sep 26 2016 9:39 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
చౌటుప్పల్ : జిల్లాలోని చేనేత కార్మికులకు సహకార బ్యాంకుల్లో క్రెడిట్‌కార్డుల ద్వారా వ్యక్తిగత రుణాలిస్తామని డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అన్నారు. మండలంలోని కుంట్లగూడెం గ్రామంలో సోమవారం జరిగిన చేనేత సహకార సంఘం మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చేనేత సంఘాలకు క్యాష్ క్రెడిట్ మంజూరు చేస్తామన్నారు. సహకార బ్యాంకుల్లో రైతులకు విరివిగా తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మిర్యాల గోవర్ధన్, ఆప్కో మాజీ డైరెక్టర్ గర్ధాసు బాలయ్య, సర్పంచ్ వల్లకాటి తులసి, ఎంపీటీసీ సభ్యుడు బత్తుల శంకర్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement