స్నేహితురాలి ఇంటికి వెళ్తే..చెరబట్టాడు! | potti subbayyapalem in Young man Sexual assault on Girl | Sakshi
Sakshi News home page

స్నేహితురాలి ఇంటికి వెళ్తే..చెరబట్టాడు!

Jun 20 2016 8:52 AM | Updated on Aug 1 2018 2:29 PM

ముక్కు పచ్చలారని బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని...

* మైనర్‌పై యువకుని లైంగిక దాడి
* పోలీసుల అదుపులో నిందితుడు
* పొట్టి సుబ్బయ్యపాలెంలో ఘటన..

వేటపాలెం : ముక్కు పచ్చలారని బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెం సముద్రతీర మత్స్యకార గ్రామంలో శనివారం జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై ఎస్‌ఎం షరీఫ్ కథనం ప్రకారం.. పొట్టి సుబ్బయ్యపాలెంలో నివసించే 12 ఏళ్ల బాలిక తన ఇంటికి సమీపంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది.

ఆదే గ్రామానికి చెందిన కోడూరి వెంకటేశ్వర్లు అలియాస్ యశోధ్ అనే యువకుడు కామంతో కళ్లు మూసుకునిపోయి బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆ సమయంలో స్నేహితురాలి కుటుంబ సభ్యులందరూ ఊరికి వెళ్లారు. రాత్రి 11 గంటలకు సమాచారం అందుకున్న ఎస్సై.. గ్రామానికి చేరుకొని బాధిత బాలికను చీరాల ఏరియా వైద్యశాలకు వైద్య పరీక్షల కోసం తరలించారు. సంఘటన స్థలాన్ని చీరాల ఇన్‌చార్జి డీఎస్పీ, రూరల్ సీఐ ఆల్తఫ్‌హుసేన్ పరిశీలించారు. బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులను విచారించారు. నిదింతునికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. యశోధ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement