శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి
Published Mon, Aug 1 2016 11:57 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 3గంటల నుంచి విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణా ప్రాంతంలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన చేస్తున్న విషయం తెల్సిందే. సోమవారం ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్లు ఒక్కొక్కటి 88.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 9,149 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్లు ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పాదన చేస్తూ 14,126 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి శ్రీశైలానికి 40వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 3.60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 43.5460 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, డ్యాం నీటిమట్టం 823.50 అడుగులకు చేరుకుంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.
Advertisement