8.120 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి | 8.120 million units power generated | Sakshi
Sakshi News home page

8.120 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి

Published Sat, Jan 7 2017 12:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

8.120 million units power generated

శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో గురువారం నుంచి శుక్రవారం వరకు 8.120 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టులో 4.089 మిలియన్‌ యూనిట్లు, తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టులో 4.031 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. రెండు పవర్‌హౌస్‌లలో డిమాండ్‌ను అనుసరించి ఉత్పాదన జరుగుతోంది. ఉత్పాదన అనంతరం సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే బ్యాక్‌ వాటర్‌ నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 109 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 861 అడుగులుగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement