26 నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు | Practical tests of 26 degree | Sakshi
Sakshi News home page

26 నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు

Published Wed, Jun 22 2016 8:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Practical tests of 26 degree

 శ్రీకాకుళం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ బి. లచ్చన్న తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తృతీయ సంవత్సరం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ 26 నుంచి జూలై 1 వరకు, ఫిజిక్స్ ప్రాక్టికల్స్ 26 నుంచి 30వ తేదీ వరకు, బోటనీ 28, 29 తేదీలలో, జువాలజీ 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
 
  అలాగే, ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ జూలై 3 నుంచి 10వ తేదీ వరకు, ఫిజిక్స్ జూలై 4 నుంచి 9వ తేదీ వరకు, బోటనీ 7, 8 తేదీలలో, జువాలజీ 8, 9 తేదీలలో నిర్వహిస్తామని తెలిపారు. ఆయూ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళంతోపాటు టెక్కలి, ఇచ్ఛాపురం, పార్వతీపురం, పాతపట్నం, పలాస స్టడీ సెంటర్లకు చెందిన ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులందరూ శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు)లో వారి హాల్ టిక్కెట్లతోపాటు రికార్డులు, గుర్తింపు కార్డులతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08942-226504 నెంబరును సంప్రదించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement