పీఎం, సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించా | prayed for good condect to cm, pm | Sakshi
Sakshi News home page

పీఎం, సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించా

Published Sun, Aug 28 2016 2:17 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఆలయం వద్ద లక్ష్మీపార్వతి తదితరులు - Sakshi

ఆలయం వద్ద లక్ష్మీపార్వతి తదితరులు

హోదా విషయంలో మోదీకి,చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించాను.

– లక్ష్మీ పార్వతి
సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాన మంత్రి మోదీకి, సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని వైఎస్సార్‌సీపీ మహిళానేత లక్ష్మీ పార్వతి అన్నారు. శనివారం ఆమె తిరుమల శ్రీవారి దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. విభజన చట్టాన్ని అమలు చేయటంలో కేంద్రం మోకాలడ్డుతుంటే సీఎం చంద్రబాబు ప్రశ్నించకుండా మంత్రి పదవుల కోసం ఆరాటపడుతుండటం దారుణమన్నారు.రైతులు కష్టాలు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. 
కేంద్రం చేసినా సీఎం చంద్రబాబు గుడ్డిగా నమ్ముతూ తలూపుతున్నాడన్నారు. 
కేంద్రం కొత్తగా ఆమోదించిన వస్తుసేవా పన్ను బిల్లు వల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోతుందని, ఇలాంటి పరిస్థితుల్లో హోదా తప్పనిసరి అని ఆమె డిమాండ్‌ చేశారు. ఇకనైనా ప్రత్యేక హోదా విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement