బ్యాంకు ఉద్యోగులకు దీపావళి కానుక | PRC arrears for NDCCB employees | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఉద్యోగులకు దీపావళి కానుక

Published Thu, Oct 27 2016 11:03 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

బ్యాంకు ఉద్యోగులకు దీపావళి కానుక - Sakshi

బ్యాంకు ఉద్యోగులకు దీపావళి కానుక

  •  రూ.3 కోట్ల పీఆర్‌సీ నిధులు విడుదల
  •  డీసీసీబీ చైర్మన్‌ మెట్టుకూరు ధనంజయరెడ్డి
  •  
    నెల్లూరు రూరల్‌ : జిల్లా కేంద్ర సహకార ఉద్యోగులకు దీపావళి కానుకగా దీర్ఘకాలిక పెండింగ్‌లో ఉన్న రూ.3 కోట్ల పీఆర్‌సీ నిధులను విడుదల చేసినట్లు డీసీసీబీ చైర్మన్‌ మెట్టుకూరు ధనంజయరెడ్డి తెలిపారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌ గురువారం పీఆర్‌సీ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 179 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. బ్యాంకు అభివృద్ధి కోసం ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయన వెంట డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ నల్లపరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, డైరెక్టర్‌ బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్, సీఈఓ రాజారెడ్డి, బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్‌ నాయకులు ప్రసాద్, దయాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement