
వానరానికి అంత్యక్రియలు
పెదవీడు (మఠంపల్లి): మండలంలోని పెద్దవీడులో కొంత కాలంగా గ్రామస్తులతో మమేకమై జీవిస్తూ శనివారం ఆకస్మికంగా మృతిచెందిన వానరానికి గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. వానరాన్ని హైందవ సాంప్రదాయంలో ఆంజనేయస్వామి ప్రతిరూపంగా ఆరాదిస్తుంటారు. దీంతో గ్రామ సర్పంచ్ సీతమ్మ నేతృత్వంలో వార్డు సభ్యులు,గ్రామపెద్దలు, మహిళలు ఊరు వాడా ఏకమై వానరానికి పసుపు కుంకుమలు, కొబ్బరికాయలతో పూజలు నిర్వíß ంచారు. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌పై ఉంచి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి గ్రామ శివారులోఅంత్యక్రియలు నిర్వహించారు.