
‘ఇంటాక్’ పోటీ విజేతకు బహుమతి
భారత జాతీయ కళా సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి పోటీలలో కడప నగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి జానగొండ అరుణకు ప్రత్యేక బహుమతి లభించింది.
కడప కల్చరల్:
భారత జాతీయ కళా సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి పోటీలలో కడప నగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి జానగొండ అరుణకు ప్రత్యేక బహుమతి లభించింది. ఇటీవల ఇంటాక్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో భాగంగా సిద్దవటం కోటలో ఇంటాక్ కడప ఛాప్టర్ కడప నగర విద్యార్థులతో క్లీన్ మాన్యుమెంట్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కడప రీజియన్ స్థాయిలో అరుణ ప్రథమ స్థానంలో నిలిచింది. శనివారం ఇంటాక్ జిల్లా కన్వీనర్ ఎలియాస్‌రెడ్డి, సభ్యులు మొగిలిచెండు సురేష్ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ దృష్టికి తెచ్చారు. ఆయన అరుణను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఇంటాక్ ఢిల్లీ కార్యాలయం బహుమతిగా పంపిన ప్రశంసాపత్రం, జ్ఞాపిక, టీ షర్టును అరుణకు అందజేసి అభినందించారు.