వీసీలో మాట్లాడుతున్న జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను బతికించినపుడే లక్ష్యం నెరవేరుతుందని జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీనారాయణ సూచించారు. మంగళవారం పల్లెవికాసంపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను బతికించినపుడే లక్ష్యం నెరవేరుతుందని జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీనారాయణ సూచించారు. మంగళవారం పల్లెవికాసంపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. నర్సరీల నుంచి తీసుకెళ్లిన మొక్కల వివరాలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొక్కల వివరాలను సరిచూసుకోవాలని, నాటిన మొక్కల వివరాలను ఎంపీడీఓల ద్వారా సేకరించి వాటిని సంరక్షఇంచే చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజులుగా వర్షాలు లేని కారణంగా ఎండిపోయే దశలో ఉన్న మొక్కలను నీరు పోయించాలని కోరారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, పల్లెవికాసం నిర్వహించిన గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. వీసీలో డీఎల్‌పీఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.