రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖలో పలువురు అధికారుల బదిలీ అయ్యూరు. జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన...
* ములుగు డివిజన్ ఈఈగా సత్యనారాయణ
* వరంగల్, ములుగు డీఈఈలుగా వెంకటేష్, రాజంనాయక్
వరంగల్: రహదారులు, భవనాల(ఆర్‌అండ్‌బీ) శాఖలో పలువురు అధికారుల బదిలీ అయ్యూరు. జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆర్‌అండ్‌బీ ములుగు డివిజన్ ఈఈగా సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన గతంలో ఏటూరునాగా రం ఎన్‌హెచ్ ఈఈగా పనిచేశారు. ఇప్పటిదాకా ములుగు డివిజన్ ఇన్‌చార్జి అధికారిగా ఎస్‌ఈ నర్సింహ వ్యవహరించారు. ఖమ్మం నుంచి వచ్చిన రాజం నా యక్ ములుగు డీఈఈగా నియమితుల య్యారు.
వరంగల్ డీఈఈ రాజేశ్వర్‌రెడ్డి పదోన్నతిపై ఖమ్మం జిల్లా జాతీయ రహదారుల శాఖ ఈఈగా, ములుగు డీఈఈగా పనిచేస్తున్న వెంకటేష్ వరంగల్ డీఈఈగా నియూమకమయ్యూరు. ఈమేరకు బదిలీపై వచ్చిన అధికారులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.