‘మా ఎమ్మెల్యేలకు భద్రత పెంచండి’ | rachamallu siva prasad reddy demand rise security for YSRCP MLAs | Sakshi
Sakshi News home page

‘మా ఎమ్మెల్యేలకు భద్రత పెంచండి’

Published Tue, May 23 2017 1:51 PM | Last Updated on Tue, May 29 2018 2:33 PM

rachamallu siva prasad reddy demand rise security for YSRCP MLAs

ప్రొద్దుటూరు: చంద్రబాబు పాలనలో విపక్ష నాయకులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో భయాందోళన సృష్టింస్తోందని ఆరోపించారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమ పార్టీ ఎమ్మెల్యేలకు 1+1 నుంచి 2+2 గన్‌మెన్ల భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు. హింసా రాజకీయాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సహించరని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement