వక్కలిగ, సాదరలను ఓబీసీ జాబితాలో చేర్చండి | raghuveerareddy demands to vakkaliga join to obc | Sakshi
Sakshi News home page

వక్కలిగ, సాదరలను ఓబీసీ జాబితాలో చేర్చండి

Published Mon, Apr 24 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

వక్కలిగ, సాదరలను ఓబీసీ జాబితాలో చేర్చండి

వక్కలిగ, సాదరలను ఓబీసీ జాబితాలో చేర్చండి

మడకశిర : నియోజకవర్గంలోని వక్కలిగ, సాదర కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్పించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడకు పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి వినతిపత్రం అందజేశారు. అగళి మండల సమీపం కర్ణాటక రాష్ట్రం శిరా తాలుకాలోని పట్టనాయకనహళ్లి గ్రామంలోఅదివారం పీఠాధిపతి నంజావధూతస్వామి 38వ జన్మదిన వేడుకలకు కేంద్రమంత్రి సదానందగౌడ, కర్ణాటక మాజీ సీఎం కూమారస్వామి, కర్ణాటక మంత్రులు జయచంద్ర, శివకుమార్, నిర్మలానంద స్వామీజీ, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ ముఖ్యఅథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మడకశిర నియోజకవర్గంలోని వక్కలిగ, సాదర కులస్తులను 2008లో రాష్ట్రంలో బీసీల జాబితాలో గుర్తించి వేర్వేరుగా జీఓ విడుదల చేశారని గుర్తుచేశారు. వక్కలిగ, సాదరులను ఓబీసీ జాబితాలో చేర్పించడానికి కృషి చేస్తామని కేంద్రమంత్రి సదానందగౌడ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement