రైలు నుంచి జారిపడి మహిళ దుర్మరణం | rail accident women dead | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి మహిళ దుర్మరణం

Published Sun, Jan 29 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

rail accident women dead

బిక్కవోలు (అనపర్తి) : 
గ్రామంలోని రాజారావుపేటకు చెందిన సిరికి సత్యవతి(45) రైలు నుంచి జారిపడి దుర్మరణం పాలైనట్టు బంధువులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున పాస్ట్‌ప్యాసింజర్‌ రైలులో సత్యవతి కుటుంబ సభ్యులతో కలసి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల దైవదర్శనానికి వెళ్ళింది. స్వామి  దర్శనానంతరం తిరిగి సాయంత్రం కాకినాడ ప్యాసింజర్‌లో బిక్కవోలు బయలుదేరారు. భీమడోలు స్టేష¯ŒSకు వచ్చిన వారు రద్దీగా ఉన్న రైలు ఎక్కబోతుండగా రైలు కదిలిపోయిందని దీంతో చివరి మెట్టుపై ఉన్న సత్వవతి జారి కిందపడి రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో నుంచి పట్టాల పైకి  జారిపోవడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఏలూరు రైల్వే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు బంధువులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement