రామగుండం: ఏడో వేతన సంఘం సిఫారసుల్లో అన్యాయం జరిగిందంటూ రైల్వే కార్మికులు, సిబ్బంది కరీంనగర్ జిల్లా రామగుండంలో ఆందోళనకు దిగారు. స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.