చినుకు..కునుకు
చినుకు..కునుకు
Published Sun, Jul 2 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
- కరువని మేఘాలు
- ఎండుతున్న పైర్లు
- ముందుకు సాగని ఖరీఫ్
- అయోమయంలో రైతన్న
- ఈ ఏడాది నష్టాలేనని పెదవి విరుపు
కర్నూలు అగ్రికల్చర్ /పత్తికొండ రూరల్ : ముందుస్తుగా ఊరించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. పలు మండలాల్లో ఇరవై రోజులుగా వాన చినుకే కరువైంది. తొలకరి జల్లులతో పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూమిలో తేమ శాతం లేకపోవడంతో మొలకదశలోనే పైర్లు వాడిపోతున్నాయి. జూన్ నెలలో 13 మండలాల్లో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. వివిధ మండలాల్లో సాధారణం మేరకు వర్షాలు పడినప్పటికీ భూమిలో పదును శాతం తక్కువగా ఉంది. గత ఏడాది జూన్ నెలలో సాధారణ వర్షపాతంకంటే 98 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
గత ఏడాది ఇదే సమయానికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నీటితో నిండి కళకళలాడుతూ కనిపించాయి. ఈ ఏడాది కూడా జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురిసినా పలు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు..నీరు లేక వెలవెలబోతుఆన్నయి. వేరుశనగ సాగుకు జూలై 15వరకు అవకాశం ఉందని.. అంతవరకు విత్తనాలు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలు కురవకపోవడంతో విత్తనాలకు డిమాండ్ అంతగా కనిపించడం లేదు. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించగా 36వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. జిల్లాకు బీటీ విత్తన ప్యాకెట్లు 10.15 లక్షలు కేటాయించగా..4లక్షల ప్యాకెట్లు మాత్రమే అమ్మకం అయ్యాయి.
వానలు తక్కువే..
ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చేస్తోంది. ఈ మేరకు ఎర్రనేలల్లో పత్తి వేయవద్దని వ్యవసాయ శాస్త్ర వేత్తలు సూచిస్తునఆనరు. వర్షాధారం క్రింద నల్లరేగడిలో మాత్రమే పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు. సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి పంటల్లో ఒకసారి గుంటెక పాయడం వల్ల పైపొర కదిలి బెట్టకు రాకుండా ఉంటాయని సలహాలు ఇస్తున్నారు.
సాగు ఇలా..
ఖరీఫ్ సాధారణ సాగు: 6,36,403 హెక్టార్లు
ఇప్పటి వరకు సాగైంది: 1,50,904 హెక్టార్లు
పంట సాధారణ విస్తీర్ణం సాగైంది
పత్తి 2,08,221 97,742
వేరుశనగ 1,10,124 19,399
మినుము 5,521 5,318
కంది, 13,255, మొక్కజొన్న 4,725, ఉల్లి 2,691, కొర్ర 802, ఆముదం 2,867 హెక్టార్లలో సాగు చేశారు.
=================
జూన్‌లో లోటు వర్షపాత శాతమిలా..
మండలం వర్షపాతం లోటు శాతం
గోనెగండ్ల 61
కొత్తపల్లి 54
తుగ్గలి 58
ప్యాపిలి 45
దొర్నిపాడు 41
శ్రీశైలం 40
ఆళ్లగడ్డ 14
నందికొట్కూరు 12
చిప్పగిరి 7
హొళగుంద 6
జాపాడుబంగ్లా 6
రుద్రవరం 5
మిడుతూరు 3
పత్తికొండ, దేవనకొండ, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, ఉయ్యలవాడ, ఆదోని, పెద్దకడుబూరు మండలాల్లో వర్షాలు అంంతంతమాత్రంగానే కురిశాయి.
నీటి పారుదల పరిస్థితి..
గత ఏడాది జూన్ నెలలో విస్తారంగా వర్షాలు పడటంతో జూలై నెలలోనే రైతులు వరి నారు పోసుకున్నారు. ఈ సారి వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆయకట్టు సాగుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీ కెనాల్ కింద 1,21,678 హెక్టార్లు, బోర్లు, బావులు కింద 1,14,703 హెక్టార్లు, లిప్ట్ ఇతర నీటి వసతి కింద 20,278 హెక్టార్ల భూములు ఉన్నాయి. వర్షాలు అంతంతమాత్రంగా ఉండటంతో ఆయకట్టు సాగు కలసి వస్తేందా లేదా అనేది ప్రశ్నార్థకం అవుతోంది.
Advertisement