‘రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి’ | rajakas joins sc list | Sakshi
Sakshi News home page

‘రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి’

Published Tue, Sep 13 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

rajakas joins sc list

అనంతపురం రూరల్‌ : ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు పి. కమ్మన్న  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం స్పందించి రజక ఫెడరేషన్లకు బడ్జెట్‌లో నిధులను కేటాయించి అభివద్ధికి కషి చేయాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం రజక ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కమ్మన్న, జిల్లా అధ్యక్షుడిగా రంగనాథ్, కార్యదర్శిగా క్రిష్ణమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శిగా లింగమయ్య, కోశాధికారిగా బయన్న, ఉపాధ్యక్షులుగా గోపాల్, రామలింగమయ్య, రాంగోపాల్, నాగరాజు తదితరులను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement