పోరాటంతోనే రజకులకు లబ్ధి
Published Sat, Jul 23 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో ఉన్న 45 లక్షల మంది రజకుల సమస్యల పరిష్కారానికి శాంతియుత పోరాటంSచేస్తున్నట్లు రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు ప్రకటించారు. శనివారం కోటప్పకొండలో నిర్వహించిన మేధోమధన సదస్సులో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ గతంలో చంద్రబాబు రజకులను ఎస్సీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసారన్నారు. ఆ తర్వాత ఆచరణలో మాత్రం నోచుకోలేదన్నారు. త్వరలో 5 లక్షల మందితో విజయవాడలో భారీ బహిరంగ నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గుర్రపుసాల రామకృష్ణ, సింగారం రంగా, పద్మజ, దేవేంద్రప్ప, సుధాకర్, కుందేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement