పసిమొగ్గపై చిమ్మిన విషం | rape attempt | Sakshi
Sakshi News home page

పసిమొగ్గపై చిమ్మిన విషం

Published Wed, Aug 31 2016 10:56 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

పసిమొగ్గపై చిమ్మిన విషం - Sakshi

పసిమొగ్గపై చిమ్మిన విషం

  • యువకుడి లైంగిక దాడి
  • ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
  • తాడిపూడిలో దారుణ సంఘటన
  •  
    బడికి వెళ్లడం.. ఆటలాడుకోవడం మినహా ఆ బాలికకు అభంశుభం తెలియదు. కుటుంబ పోషణ కోసం ఆమె తండ్రి పొరుగు రాష్ట్రంలో కూలీ పనులకు వెళ్లిపోయాడు. తల్లి కూడా కూలీ పనులు పనులు చేస్తోంది. ఇంటి వద్ద పెద్దలు లేకపోవడంతో.. ఒంటరిగా ఉన్న ఆ బాలికపై ఓ మృగాడి కన్నుపడింది. మాయమాటలతో మభ్యపెట్టి ఆ అమాయకురాలికి నరకం చూపించాడు. వారం రోజుల తర్వాత ఆమె స్కూల్‌ టీచర్‌ గమనిస్తేనే కానీ.. ఈ దారుణ సంఘటన వెలుగులోకి రాలేదు.
    – తాడిపూడి(ఆత్రేయపురం)
     
    తాడిపూడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి పదేళ్ల వయసున్న కుమార్తె స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కుటుంబ పోషణ కోసం ఆమె తండ్రి కొంతకాలం క్రితం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆమె తల్లి కూలీ పనులు చేస్తూ, బిడ్డను చూసుకుంటోంది. ఇలాఉండగా వారి పక్కనే 22 ఏళ్ల రేగుళ్ల సురేంద్ర అనే యువకుడు నివసిస్తున్నాడు. ఆ బాలికపై సురేంద్ర చెడు దృష్టి పడింది. వారం రోజుల క్రితం ఆ బాలిక తన ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో ఆ పాపకు మాయమాటలు చెప్పి, ఎవరూ లేనిచోటకు తీసుకువెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా వారం రోజుల తర్వాత, మంగళవారం పాఠశాలలో ఆ బాలిక బాధతో విలవిల్లాడడాన్ని స్కూలు టీచర్‌ గమనించారు. బాలికను ఆరాతీయగా.. ఆ దారుణాన్ని వివరించింది. ఈ విషయాన్ని పాప తల్లికి ఆమె వివరించింది. వైద్య పరీక్షల కోసం బాలికను రావులపాలెంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, ఆమెపై లైంగికదాడి జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు బాధితురాలి తల్లి గురువారం ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. రావులపాలెం సీఐ పీవీ రమణ, ఎస్సై జేమ్స్‌ రత్నప్రసాద్‌ పాఠశాలకు చేరుకుని టీచర్‌ను, బాధితురాలి ఇంటి వద్ద స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ రమణ తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement