కొత్త జిల్లా కార్యాలయాల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి | ready to newdistrict | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లా కార్యాలయాల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి

Published Fri, Sep 23 2016 9:57 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లా కార్యాలయాల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి - Sakshi

కొత్త జిల్లా కార్యాలయాల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి

  • అదనపు జాయింట్‌ కలెక్టర్‌ నాగేంద్ర 
  • కరీంనగర్‌ అర్బన్‌ : కరీంనగర్‌ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన కార్యాలయాల భవనాల ఫొటోలు, భవన నమూనా ప్రణాళికలను ఆన్‌లైన్‌లో వెంటనే అప్‌లోడ్‌ చేయాలని అదనపు జాయింట్‌ కలెక్టర్‌ నాగేంద్ర అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లాల పునర్విభజన పనుల ప్రగతిపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటాయించిన కార్యాలయ భవనాల మ్యాప్‌లతో గదుల వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అన్నారు. రెండు జిల్లాలకు కేటాయించిన కుర్చీలు, టేబుళ్లు, వాహనాలు, ఇతర ఎక్విప్‌మెంట్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యాలయాల్లో గల రన్నింగ్‌ ఫైళ్లు, డిస్పోజల్‌ ఫైళ్లు సాధారణ ఫైళ్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. కొత్త జిల్లాలకు కావాల్సిన ఎక్విప్‌మెంటు వివరాలు వెంటనే అందజేయాలని, వాటిని కొనుగోలు చేసి ఇస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ వీరబ్రహ్మయ్య, అదనపు ఎస్పీ అన్నపూర్ణ, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, సీపీవో సుబ్బారావు పాల్గొన్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement