రైల్వేకోడూరు రూరల్(వైఎస్సార్): టూరిస్ట్ బస్సులో వైఎస్సార్ జిల్లాలోకి వస్తున్న ఎర్రకూలీలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో 23 మంది తమిళ కూలీలు ఉన్నారని, మరో 25మంది వరకు పరారైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అర్థరాత్రి సమయంలో సీఐ రసూల్‌సాహెబ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో తమిళనాడుకు చెందిన ఓ టూరిస్ట్ బస్సు వచ్చింది. తిరుపతి నుంచి కడప వెళుతోందని తెలుసుకున్న పోలీసులు అనుమానంతో ఆపారు. పోలీసులను చూడగానే కొందరు బస్‌లో నుంచి దూకి పారిపోయారు.
పోలీసులు, చెక్‌పోస్టు వద్ద ఉన్న సిబ్బంది బస్ చుట్టూ కట్టెలు పట్టుకుని నిలబడ్డారు. ఎన్‌కౌంటర్ చేస్తామని సీఐ హెచ్చరించడంతో చివరకు 23 మంది తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు పట్టుబడ్డారు. వారిని బస్ సహా కోడూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. బస్‌పై ఉన్న ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌కౌంటర్ చేస్తామంటే.. లొంగిపోయారు!
Published Sun, Jun 5 2016 8:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
Advertisement
Advertisement