
మతపర రిజర్వేషన్లను సహించం
►బీజేవైఎం జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి
►బీజేపీ, బీజేవైఎం నాయకుల కలెక్టరేట్ ముట్టడి
►అడ్డుకున్న పోలీసులు, అరెస్ట్
కామారెడ్డి క్రైం (కామారెడ్డి) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మతపర రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేవైఎం జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ముస్లిం, మైనార్టీలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కామారెడ్డి జిల్లాకేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జూలూరి సుధాకర్‌ల ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరారు. బీజేవైఎం జాతీ య కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి ఆం దోళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
అంబేద్కర్ రాజ్యాం గానికి తూట్లు పొడుస్తున్న కేసీఆర్ ప్రభు త్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. మ తపరమైన రిజర్వేషన్ల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రం గా నష్టపోతారన్నారు. తెలంగాణ ప్ర భుత్వం ఒక వర్గానికే కొమ్ముకాయడం సరికాదన్నారు. మతపర రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎంత వరకైనా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దీంతో పోలీ సులు అక్కడకు చే రుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులను అడ్డుకున్నారు. అరె స్ట్ చేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. రాష్ట్ర నాయకు లు ఇట్టం సిద్దిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, నాయకులు తున్కివేణు, సదాశివరెడ్డి, నరేందర్‌రెడ్డి, విఠల్, పు ల్లూరి సతీష్, భాస్కర్, గోపి, రాజాసిం గ్, రీతూసింగ్, తదితరులు ఉన్నారు.