Religious reservations
-
బీసీ రిజర్వేషన్ వార్
-
'రేపు అసెంబ్లీని ముట్టడిస్తాం'
-
'రేపు అసెంబ్లీని ముట్టడిస్తాం'
హైదరాబాద్‌సిటీ: మత పరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, అసెంబ్లీలో బిల్లు పెట్టడాన్ని అడ్డుకుంటామని బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. రేపు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అసెంబ్లీని ముట్టడించి తీరుతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్న బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ కేసులతో ప్రజల గొంతు నొక్క లేరని హెచ్చరించారు. ధర్నా చౌక్ ఎత్తి వేయడం ఆపేయాలని కోరారు. పోలీస్ రాజ్యంతో రేపు జరుగబోయే అసెంబ్లీ ముట్టడిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. మత పరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. ప్రైవేటు బడుల్లో దోపీడీపై ప్రేక్షకపాత్ర దేశ రాజధాని ఢిల్లీ కన్నా హైదరాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు సైతం మూడు నాలుగు లక్షల ఫీజులను దండుకుంటున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని కె.లక్ష్మణ్ మండిపడ్డారు.. ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ కళాశాలల ఫీజులను ఎందుకు నిర్ణయించలేకపోతోందని గురువారం అసెంబ్లీలో ప్రశ్నించారు. అధిక ఫీజుల విషయంలో 12 పాఠశాలలకు నోటిసులు ఇచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని లక్ష్మన్ నిలదీశారు. కార్పొరేట్ పాఠశాలల అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడేళ్లు అయినా కేజీ టూ పీజీ విద్య పథకానికి ఓ విధానం రూపకల్పన చేయలేదని తప్పుపట్టారు. శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న ఓయూలో 1267 ప్రొఫెసర్ పోస్టులకు గాను 553 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుత అవసరాలకు కనీసం 3500 బోధన సిబ్బంది అవసరమన్నారు. బోధన సిబ్బంది లేక ఓయూలో పరిశోధనలు, పీహెచ్డీ ప్రవేశాలు నిలిచిపోవడం ఆవేదన కలిగిస్తోందని లక్ష్మన్ అన్నారు. -
మతపర రిజర్వేషన్లను సహించం
►బీజేవైఎం జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి ►బీజేపీ, బీజేవైఎం నాయకుల కలెక్టరేట్ ముట్టడి ►అడ్డుకున్న పోలీసులు, అరెస్ట్ కామారెడ్డి క్రైం (కామారెడ్డి) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మతపర రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీజేవైఎం జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ముస్లిం, మైనార్టీలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కామారెడ్డి జిల్లాకేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జూలూరి సుధాకర్ల ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరారు. బీజేవైఎం జాతీ య కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి ఆం దోళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. అంబేద్కర్ రాజ్యాం గానికి తూట్లు పొడుస్తున్న కేసీఆర్ ప్రభు త్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. మ తపరమైన రిజర్వేషన్ల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రం గా నష్టపోతారన్నారు. తెలంగాణ ప్ర భుత్వం ఒక వర్గానికే కొమ్ముకాయడం సరికాదన్నారు. మతపర రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎంత వరకైనా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దీంతో పోలీ సులు అక్కడకు చే రుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులను అడ్డుకున్నారు. అరె స్ట్ చేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. రాష్ట్ర నాయకు లు ఇట్టం సిద్దిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, నాయకులు తున్కివేణు, సదాశివరెడ్డి, నరేందర్‌రెడ్డి, విఠల్, పు ల్లూరి సతీష్, భాస్కర్, గోపి, రాజాసిం గ్, రీతూసింగ్, తదితరులు ఉన్నారు.