చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ | revanth reddy met chandrababu naidu in vijayawada | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ

Published Mon, Oct 26 2015 7:48 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ - Sakshi

చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ

విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి అంశంపై వీరిరువురు మంతనాలు జరిపారు. ఇక ఎర్రబెల్లి దయాకరరావుతో విభేదాలపై రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు సమాచారం.

(గతంలో ఎర్రబెల్లి దయాకరరావుఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తిని రేవంత్‌రెడ్డి.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉద్యోగంలో పెట్టుకోవడంపై మొదలైన గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో దూషించుకోవడంతో ఆ పంచాయితీ కాస్తా బాబు దగ్గరకు చేరింది) కాగా వరంగల్ ఉప ఎన్నికపై తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం చంద్రబాబు నాయుడును కలవనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement