అగ్ని ప్రమాదంలో వరి కుప్పలు దగ్ధం
Published Wed, Nov 30 2016 2:35 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
కంచిలి : కొల్లూరు పంచాయతీ పరిధి అరవసరియాపల్లి గ్రామ సమీపంలో వరి పంట పొలాల్లో నూర్పు చేసే ట్రాక్టర్‌తో ఉన్న యంత్రం అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. దీంతో సంబంధిత పంట పొలంలో వరికుప్పలు కూడా పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే...మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన బుడ్డెపు తమ్మయ్యకు చెందిన పొలంలో వరి ధాన్యాన్ని ట్రాక్టర్ సహాయంతో నడిచే యంత్రంతో నూర్పు చేస్తుండగా , అనుకోకుండా సంబంధిత ట్రాక్టర్ ఇంజిన్ నుంచి హఠాత్తుగా మంటలు వచ్చి, అప్పటికప్పుడు ట్రాక్టర్ ఇంజిన్, యంత్రం వరకు అంతటా మంటలు వ్యాపించాయి.
దీంతో కాలిపోయాయి. దీంతో సంబంధిత పొలంలో నూర్పు చేస్తున్న వరి కుప్పలకు కూడా ఆ మంటలు వ్యాపించటంతో ఆ ధాన్యం కూడా కుప్పల్లోనే కాలిపోయాయి. ఈ సమాచారం తెలుసుకొన్న సోంపేట అగ్నిమాపక శకటం వచ్చి మంటల్ని అదుపు చేశారు. నూర్పిడి ట్రాక్టర్ యంత్రం సమీప ఒడిశా గ్రామమైన భవానీపురం గ్రామానికి చెందిన ఇసురు సుబ్బారెడ్డికి చెందినది. వరి కుప్పలు కాలిపోవటంతో సుమారు 50 బస్తాల ధాన్యం కాలి బూడిదయ్యాయని రైతు బుడ్డెపు తమ్మయ్య విలేకర్లతో చెప్పారు. రూ.50 వేల వరకు నష్టం జరిగినట్టు రోదిస్తూ వాపోయాడు.
Advertisement
Advertisement