సంఘటితంగా హక్కుల సాధన
మన్సూరాబాద్: పద్మశాలీయులు సంఘటితంగా ఉంటేనే హక్కులను సాధించుకోవచ్చని రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్ అన్నారు. మన్సూరాబాద్ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనవహోత్సవ ఆత్మీయ సన్మానాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కలసికట్టుగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంక్షేమ సంఘ అధ్యక్షుడు వనం కోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరిపల్లి సీతారాములు, ఆప్కో మాజీ డైరక్టర్ గర్దాసు బాలయ్య, చండూరు మాజీ జెడ్‌పీటీసీ సభ్యులు నామని గోపాల్, పద్మశ్రీ గజం అంజయ్య, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోషిక యాదగిరి, ఎల్‌బీనగర్ టీఆర్‌ఎస్ ఇంచార్జి ముద్దగౌని రాంమోహన్‌గౌడ్, కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, చిట్టిపోలు సారుుజనశేఖర్, ఎల్‌బీనగర్ పద్మశాలి సంఘ అధ్యక్షుడు రామునేత, మన్సూరాబాద్ పద్మశాలి సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడు గంజిసత్తయ్య, దోర్నాలి విష్ణు, గంజి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.