చేనేతలకు గుర్తింపు జగనన్న చలవే
పద్మశాలీయులకు జగనన్న ప్రభుత్వంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. గతంలో శాలీలుగా పిలిపించుకున్న తాము కార్పొరేషన్ ఏర్పాటుతో ఆ పిలుపునుంచి ఉపశమనం లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 లక్షల వరకు ఉన్న తమ సామాజిక వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలు, అందిస్తున్న ప్రోత్సాహంపై ఆమె సాక్షితో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
కార్పొరేషన్‌తో అభివృద్ధికి అవకాశం
చేనేత వృత్తిలో ఉన్న పద్మశాలీయుల అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమి లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 అక్టోబర్ 18న కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తనతోపాటు రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 12 మందిని డైరెక్టర్లుగా నియమించారు.
రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, మంగళగిరి, విశాఖపట్నం, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, తణుకు, రాజమండ్రి, పెడన, ఉప్పాడ, పొందూరు, అరకు, పాడేరు, లంబసింగి, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, నగరి, పుత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కువగా మా సామాజికవర్గానికి చెందినవారున్నారు. పద్మశాలీయుల్లో సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, స్వకులశాలి, పట్టుశాలి వంటి ఉప కులాలున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారానే గుర్తింపు వచ్చింది.
చట్టసభల్లోనూ అవకాశం
2014 టీడీపీ ప్రభుత్వంలో పద్మశాలీయులు చట్టసభలో లేరు. 2019 వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు ఎంపీగా డాక్టర్ సంజీవకుమార్, ఎమ్మెల్సీగా మురుగుడ హనుమంతరావు ఉన్నారు. ఆప్కో చైర్మన్లుగా చల్లపల్లి మోహన్‌రావు, ప్రస్తుతం గంజి చిరంజీవి ఉన్నారు. రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, రాయదుర్గం, వెంకటగిరి, చీరాల మున్సిపల్ చైర్పర్సన్లుగా పద్మశాలీయులే ఉన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బుట్టా రేణుక, మంగళగిరికి మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు.
విదేశీ విద్యకు ప్రోత్సాహం
నేను చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాక అనేక మందిని విదేశీ విద్య పథకంపై అవగాహన కల్పించి పంపించా. హ్యాండ్లూం టె క్స్‌టైల్స్ కార్పొరేషన్ ద్వారా జాకార్డ్, లిఫ్టింగ్ మెషీన్‌తోపాటు మగ్గం పరికరాలను సబ్సిడీపై చా లా మందికి అందించా. – ప్రొద్దుటూరు
సైకత మగువ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తీరప్రాంతంలో సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్ సిలికా దిబ్బలవద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. గ్రామానికి చెందిన యువతులతో కలిపి ఈ శిల్పాన్ని ప్రదర్శించారు. – చిల్లకూరు
తిరుచానూరు అమ్మవారికి మా ఇంటి చీర సారె..
ఏటా తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవాల్లో సింహవాహన సేవ రోజున పద్మశాలీయుల ఇంటి నుంచి చీర, సారె సమర్పించేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అమ్మవారికి కుట్టు బార్డర్‌తో కలిగిన 9 ఇంచుల కంచిపట్టు చీరను సమర్పిస్తున్నాం. రాష్ట్రంలోని తమ సామాజికవర్గంవారందరికీ తిరుచానూరు నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుతోంది.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున స్వామివారికి చీర, సారె ఇస్తున్నాం. చేనేతల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా మగ్గం నేసే ప్రతి కార్మికుడి కుటుంబానికి ఏటా రూ.24వేలు చెల్లిస్తున్నారు. ఈ పథకం వచ్చాక చాలా మంది తిరిగి వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పల్లెలుప్రగతిపట్టాలెక్కిపరుగులు పెడుతున్నాయి. గ్రామ సీమల స్వరూపం మారుతోంది. బాపూజీ కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో సుసాధ్యమైంది. పాలకొల్లు మండలంలోని వెలివెల గ్రామంలో రూ.8.60 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి.
ఈ గ్రామంలో 817 కుటుంబాల దరికి సంక్షేమ పథకాలు చేరాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలన్నీ మీ పల్లెకు తీసుకురావడం సీఎం జగన్ సర్కారుకే చెల్లిందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో చిన్నచిన్న పనులకు కూడా కిలోమీటర్ల దూరం వెళ్లాల్సివచ్చిందని, ఇప్పుడు పదడుగులు దూరంలోనే సమకూర్చడంతో సమయం కలిసివస్తోందని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. – పాలకొల్లు