కొట్టుకుపోయిన రోడ్లు.. కూలిన ఇళ్లు | roads damaged.. houses collapsed | Sakshi
Sakshi News home page

కొట్టుకుపోయిన రోడ్లు.. కూలిన ఇళ్లు

Published Sun, Sep 25 2016 9:39 PM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

పెద్ద చెరువు వద్ద కొట్టుకుపోయిన రహదారి - Sakshi

పెద్ద చెరువు వద్ద కొట్టుకుపోయిన రహదారి

తూప్రాన్‌లో భారీగా వర్షం

తూప్రాన్‌: మండలంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి తూప్రాన్‌ మండలంలోని వాగులు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం మండలంలో 16 సెం.మీ.  వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.  వర్షాలకు మండలంలో 270 ఇళ్లు కూలినట్లుగా గుర్తించినట్లు తహసీల్దార్‌ వెంకటనర్సింహారెడ్డి తెలిపారు.

వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో తూప్రాన్‌-గుండ్రెడ్డిపల్లి రహదారి, వట్టూరు- శివ్వంపేట మండలం గుండ్లపల్లి, నాగులపల్లి- వెల్దుర్తి రహదారి, తూప్రాన్‌- కిష్టాపూర్‌ రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కాగ పట్టణంలోని దేవి గార్డెన్‌ వద్ద తూప్రాన్‌ -నర్సాపూర్‌ రహదారిపై నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం నాలుగు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement