జిల్లాలో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి.
జిల్లాలో ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. దీంతో పలు గ్రామాల నుంచి రాక పోకలు పూర్తిగా తెగి పోయాయి. ఆలహర్వి మండలం మెజహ గ్రామ సమీపంలో పెద్దవంక పొంగి పొర్లడంతో.. రహదారి పూర్తిగా మునిగి పోయింది. వరద నీరు భారీగా రోడ్డు పైకి రావడంతో.. ఆలహర్వి-బళ్లారి మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.