వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి.. | robbery | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి..

Published Wed, Apr 26 2017 12:15 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery

తాడిపత్రి టౌన్: ఒంటరిగా ఉన్న వృద్ధురాలి నోట్లో కొందరు దుండగులు గుడ్డలు కుక్కి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన తాడిపత్రి భగత్సింగ్‌నగర్‌లో మంగళవారం మధ్యాహ్నం పట్ట పగలు జరగడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాలనీకి చెందిన రజాక్‌వలి తన వృద్ధ తల్లిని ఇంటి వద్ద కాపలాగా ఉంచి, భార్యా పిల్లలతో కలసి బంధువుల ఊరికి వెళ్లారు. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు ఇంట్లోకి జొరబడ్డారు. ఆమె అరవకుండా నోట్లోకి గుడ్డలు కుక్కి పది తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే తాడిపత్రి చేరుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement