నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేశారు. సదరు బస్సులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయని ఆర్టీఏ ఆధికారులు వెల్లడించారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నిబంధనలు విరుద్ధంగా జిల్లాలో వాహనాలు నడుస్తున్నట్లు ఆర్టీఏకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ దాడులు నిర్వహించింది.