ముగిసిన ఆర్‌యూ సెట్
కర్నూలు(ఆర్‌యూ) : రాయలసీమ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశ పరీక్షలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు పరీక్షల్లో రిజిస్ట్రార్ అమర్‌నాథ్ ఆదోని ఆర్ట్స్ కాలేజ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులుగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. నంద్యాల, ఆదోని, కర్నూలులో మొత్తం 4 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. ప్రతిరోజు 4 సెషన్ల ప్రకారం మొత్తం 18 డిపార్ట్‌మెంట్లకు వర్సిటీ క్యాంపస్‌లో 608 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 2,600 సీట్లకు 4,397 మంది దరఖాస్తు చేసుకోగా 3,953 మంది(89.9 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను జూన్ 1వ తేదీ లోగా ప్రకటించి మొదటి వారంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని పీజీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సి.వి.కృష్ణారెడ్డి తెలిపారు.