సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం పోటెత్తిన భక్తుల రద్దీతో కాలిబాట క్యూలో తోపులాటలు జరిగాయి. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేసవి సెలవులు ముగిసే దశకు చేరుకోవటం, వారాంతపు సెలవులతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అదేవిధంగా లగేజీ డిపాజిట్ చేసే చోట కనీస సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
సర్వదర్శనం, కాలిబాట భక్తులతో రెండు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. వెలుపల క్యూలైన్లు రెండు కిలోమీటర్లు విస్తరించాయి. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం సుమారు 40 వేల మంది దాకా భక్తులు కాలిబాటల్లో నడిచి వచ్చారు. వీరికి 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది.
తిరుమల కాలిబాట క్యూలైన్లలో తోపులాట
Published Sun, Jun 5 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
Advertisement