మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి
-
జిల్లాను మెుదటిస్థానంలో నిలుపుదాం
-
ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్ రూరల్: మొక్కలను నాటడంతోపాటు సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ మండలం చామన్‌పల్లిలో గురువారం నిర్వహించిన హరితహారంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో జిల్లాను మొదటిస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. మొక్కలు నాటి సంరక్షించి బాధ్యతను మహిళలు స్వచ్ఛందంగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీ కోఆప్షన్‌సభ్యుడు జమిలొద్దీన్, సర్పంచు గంట శంకరయ్య, ఎంపీటీసీ సభ్యులు అశోక్, బాలయ్య, తహశీల్దార్ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందర్‌రాజు పాల్గొన్నారు.
హరితహారం లఘుచిత్ర షూటింగ్ ప్రారంభం
తిమ్మాపూర్: రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సారథ్యంలో చిత్రీకరిస్తున్న తెలంగాణకు హరితహారం లఘుచిత్రాన్ని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలుపుదామని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2.50 కోట్ల మొక్కలు నాటామని, వర్షాలు లేక ఆలస్యమవుతున్నా ఇంకా 1.50కోట్ల మొక్కలు నాటాలనే సంకల్పంతో ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఖాళీల స్థలాలను గుర్తించి వర్షాలు పడగానే లక్ష్యం మేరకు మొక్కలు నాటి రక్షించుకుందామన్నారు. జిల్లాలో మానకొండూర్, కరీంనగర్ నియోజకవర్గాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటాయని చెప్పారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ చెట్టుతో ఉపయోగాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఆగస్టు 15వరకు పూర్తి చేసి విడుదల చేస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎంపీపీ ప్రేమలత, జెడ్పీటీసీ పద్మ, తహశీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో పవన్‌కుమార్ పాల్గొన్నారు.