- నల్లగొండ జిల్లాలో విషాదం
తుర్కపల్లి
స్కూల్ బస్సు చక్రాల కింద రెండేళ్ల చిరుప్రాయం నలిగిపోయింది. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన వివరాలు.. తుర్కపల్లి మండల పరిధిలోని నాగపల్లితండాకు చెందిన ధారవత్ నర్సింహ, శారద దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆడపిల్లలు సుమిత్ర, సంధ్య, నిఖిత మండల కేంద్రంలోని పడాల విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు.
విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఆ విద్యాసంస్థల బస్సు సోమవారం ఉదయం తండాకు వచ్చింది. కూతుళ్లను బస్సులో ఎక్కించడానికి నర్సింహ రెండేళ్ల కుమారుడు లోకేశ్‌ను ఎత్తుకుని వచ్చాడు. స్కూల్‌బస్సు రాగానే కుమారుడిని కిందకు దించి ముందుగా ఇద్దరు కూతుళ్లను అందులో ఎక్కించాడు. మరో కూతురిని ఎక్కిస్తుండగా డ్రై వర్ గమనించకుండా బస్సును కదిలించాడు. అప్పటి వరకు తండ్రితో పాటే ఉన్న లోకేశ్ బస్సుకు ఆనుకుని నిలబడడంతో అది కదలడంతో కిందపడ్డాడు. గమనించిన తండ్రి కేకలు వేస్తుండగా బస్సుచక్రాలు చిన్నారి తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.