
వరదనీటిలో చిన్నారులు..
ఆల్విన్ కాలనీ: అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి ఓ పాఠశాల యాజమాన్యం స్కూల్ నడపగా...చిన్నారులు వరదనీటిలో చిక్కుకుని అల్లాడిపోయారు. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు శనివారం ధరణీనగర్‌లోని చిన్నారులను పాఠశాలకు తీసుకువెళ్ళడానికి కాలనీలోకి వచ్చింది.
ఆ సమయంలో రహదారిపై భారీగా వరదనీరు ఉండడంతో సైలెన్సర్‌లోనికి నీరు వెళ్లి బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, మీడియా సిబ్బంది బస్సును రోడ్డు వరకు తోసి చిన్నారులను కాపాడారు. మరో బస్సును తీసుకువచ్చి పిల్లలను సురక్షితంగా తీసుకువెళ్లారు.