బడి బస్సులు
బడి బస్సులు
Published Wed, Jun 21 2017 9:52 PM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
– 71 విద్యార్థి బస్సులను నడిపేందుకు చర్యలు
– రూట్ల వారిగా సర్వీసులు ఖరారు చేసిన ఆర్టీసీ
– అసవరమైతే మరిన్ని నడుపుతాం: డీసీటీఎం శ్రీనివాసులు
కర్నూలు (రాజ్‌విహార్): బడి పిల్లలపై రోడ్డు రవాణ సంస్థ కరుణ చూపింది. ఉన్న ఊరు నుంచి విద్యా సంస్థలు ఉన్న పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు విద్యార్థి బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12డిపోల నుంచి 71 విద్యార్థి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రూట్ల వారిగా సర్వీసులు ఖరారు చేసి ఆచరణకు సిద్ధం చేశారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని, అవసరాలను బట్టి మరిన్ని నడుపుతామని అధికారులు పేర్కొంటున్నారు.
– డిపోల వారిగా విద్యార్థి బస్సులు తిరిగే రూట్లు
– ఆదోని డిపో:
ఆదోని డిపో నుంచి ఐదు విద్యార్థి బస్సులు నడుపుతుండగా ఆదోని నుంచి తొగలగల్లు– డి.కోటకొండ, బనవనూరు– కల్లుకుంట, హొళగుంద– చిన్నకుంట, సుంకేశ్వరి– హానవాలు, ఆలూరు–ఎల్లార్తి, హొళగుందకు నడుపుతున్నారు.
– డోన్ డిపో:
డోన్ డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కంబాలపాడు– మల్లెంపల్లె, డోన్– సి.కొతూరు, డోన్–జలదుర్గం, డోన్ జక్కసాని గుంటకు తిప్పుతున్నారు.
– కర్నూలు–2 డిపో:
కర్నూలు–2 డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కర్నూలు– రేమట, కర్నూలు– అనుగొండ, కర్నూలు–ముడుమాల, కర్నూలు– సీ.బెళగల్‌కు నడుతుతున్నారు.
– నందికొట్కూరు డిపో:
నందికొట్కూరు డిపో నుంచి ఎమినిది బస్సులు నడుపుతుండగా నందికొట్కూరు తర్తూరు, మండ్లెం, జూపాడుబంగ్లా, కె.ప్రాతకోట, బిజినెవేముల, కొనిదేల, వడ్డెమాను, వాడాల, చెరుకుచెర్ల, పైపాళెం, పగిడ్యాల, వీపనగండ్ల, వనుముల పాడు, లక్ష్మాపురం, కడుమూరు, పైపాళెం, నెహ్రు నగర్, నాగటూరు, నెహ్రు నగర్, పారుమంచాల, కడుమూరు, పైపాళెం, వాడాల, చౌట్కూరుకు తిప్పుతున్నారు.
– ఎమ్మిగనూరు డిపో:
ఎమ్మిగనూరు డిపో నుంచి 12బస్సుల్లో ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు, ఆదోనికి మూడు, మసీదుపురం, కంపాడు, మల్కాపురం, పెద్దకొత్తిలి, వి.తిమ్మాపురం, నాగలదిన్నె, కనకవీడు మధ్య నడుపుతున్నారు.
– ఆళ్లగడ్డ డిపో:
ఆళ్లగడ్డ డిపో నుంచి తొమ్మిది బస్సులు నడుపుతుండగా ఆళ్లగడ్డ నుంచి సుద్దమల్ల, చాగలమర్రి, శ్రీరంగాపురం, ఆర్.జంబులదిన్నె, బీసీపీఎల్–తండా, చందలూరు, చిన్న వాగలి, రామచంద్రాపురం మధ్య తిప్పుతున్నారు.
– ఆత్మకూరు డిపో:
ఆత్మకూరు డిపో నుంచి 11 బస్సులు నడుపుతుండగా ఆత్మకూరు–ఇస్కాల, బైర్లూటి, కొత్తలచెర్రు, గుమ్మడపురం, వానాల, పి.అనంతపురం, ఏటీకే–మద్దూరు, జడ్డువారి పల్లె, వేంపెంట, మద్దూరు, వెలుగోడు, రేగడ గూడూరు గ్రామాలకు తిప్పుతున్నారు.
– బనగానపల్లె డిపో:
బనగానపల్లె డిపో నుంచి ఎమినిది బస్సులు తిప్పుతుండగా బనగానపల్లె– గార్లదిన్నే, బేతంచెర్ల, కందికాయపల్లె, రామతీర్థం, చెర్లో కొత్తూరు, కొండనాయుని పల్లె, టంగుటూరు, ఆర్‌జీఎం కాలేజీ నెర్రవాడ గ్రామాల మధ్య నడుపుతున్నారు.
– కోవెలకుంట్ల డిపో:
కోవెలకుంట్ల డిపో నుంచి నాలుగు బస్సులు నడుపుతుండగా కోవెలకుంట్ల– కాకరవాడ, కొండ సుంకేసుల, పెద్ద వెంచర్ల, కాశీపురం– అవుకు మధ్య తిరుగుతున్నాయి.
– నంద్యాల డిపో:
నంద్యాల డిపో నుంచి ఐదు బస్సులు నడుపుతుండగా నంద్యాల–గుండంపాడు, పులిమద్ది, బోయిల్‌కుంట్ల, మహానంది, గుంటనాల, ఏవీఆర్ ఎస్‌వీఆర్ కళాశాల, తిమ్మాపురం, గడివేముల మోడల్ స్కూల్, గోరుకల్లు, ఆర్‌జీఎం కళాశాలకు సర్వీసుల తిప్పేందుకు చర్యలు చేపట్టారు.
అవసరమైతే మరిన్ని బస్సులు: శ్రీనివాసులు, డీసీటీఎం, ఆర్టీసీ
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం 71 విద్యార్థి బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాం. వీరి రాకపోకల్లో సమయాలు మర్చాలని విద్యార్థులు, కళాశాల, పాఠశాల యాజమాన్యాలు విన్నవిస్తే సరి చేస్తాం. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ప్రైవేటు ఆటోలకు బదులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే సంస్థకు మేలు కలుగుతుంది. దీంతో అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు వీలుంటుంది.
Advertisement