
సింధు స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రియో ఒలింపిక్స్ విజేత సింధును స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో రాణించాలని టేబుల్ టెన్నిస్ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌సాహెబ్ పేర్కొన్నారు. క్రికెట్, జిమ్నాస్టిక్స్, టేబుల్‌టెన్నిస్ జిల్లా జట్ట ఎంపిక గురువారం నిర్వహించినట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నారాయణ తెలిపారు. టేబుల్‌టెన్నిస్ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌సాహెబ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. జిల్లా స్థాయికి ఎంపిక కావడం ఎంతో గొప్ప విషయమన్నారు.
అండర్–17 బాలికల క్రికెట్ జట్టు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. అండర్–14,17 బాలుర, బాలికల జిమ్నాస్టిక్స్ పోటీలు గుంటూరులో జరుగుతాయన్నారు. టేబుల్‌టెన్నిస్ అండర్–14 బాలుర, బాలికల రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడలోను, అండర్–17 బాలుర, బాలికల పోటీలు ఏలూరులో జరుగుతాయని కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ పోటీలకు అబ్జర్వర్లుగా డీ నాగరాజు, నాగరాజా, అంజన్న, శంకర్, సెలెక్షన్ కమిటీ సభ్యులుగా లత, మంజుల, రవి, సిరాజుద్దీన్, సునీత, జయసింహ, పీఈటీలు మొరార్జీ యాదవ్, రమేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.