మొక్కుబడి భద్రత..!
Published Sat, Jul 16 2016 8:29 PM | Last Updated on Sat, Sep 15 2018 7:22 PM
అమలుకాని విద్యాహక్కు చట్టం
ఆలేరు : ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టిన, ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఆశించిన ఫలితాలివ్వడం లేదు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లోనే నేటికీ విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. విద్యాహక్కు చట్టం వచ్చినా నిరుపేద పిల్లలకు కల్పిస్తున్న వసతులు అంతంతే. ప థకాల అమలులో అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లేమితో లక్ష్యం నెరవేరడం లేదు. నేడు శనివారం పాఠశాలల భద్రత, ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అందిస్తున్న కథనం.
తమిళనాడులోని కుంభకోణంలో..
2004 తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో ఓ పాఠశాల లో అగ్ని ప్రమాదం సంభవిం చి 58 మంది విద్యార్థులు చని పోయారు. అప్పట్లో ఈ ఘట న దేశవ్యాప్తంగా అనేక విమర్శలకు తావిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరుసటి సంవత్సరం నుంచి జూైలై 16 న పాఠశాలల్లో భద్రత, ఆ రోగ్య దినోత్సవం నిర్వహిం చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిం ది. ఈరోజున విద్యార్థులకు అ ప్రమత్తత, ఆరోగ్యం, మధ్యా హ్న భోజనం, పాఠశాల భవనాలపై అవగాహన కల్పిస్తారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 3276 ఉన్నాయి. వీటిల్లో 1,425 పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నీటి వసతి లేదు, 914 పాఠశాలలకు ప్రహరీ లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 617 స్కూళ్లలో తాగునీటి వసతిలేదు. విద్యుత్ సౌకర్యం లేనివి 284, మరుగుదొడ్లు లేనివి 251 పాఠశాలలున్నాయి. అలాగే ఆలేరులోని శారాజీపేట, గొలనుకొండ, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, రాజాపేట మండలంలోని చల్లూరు, బొందుగులలోని హై స్కూళ్లు శిథిలావస్థకు చేరాయి. భువనగిరి నియోజకవర్గంలో తుక్కాపురం, గౌస్‌నగర్, బండసోమారం, రాయగిరి పాఠశాలలు అ ద్వానంగా ఉన్నాయి. ఇలా జిల్లాలో అనేక చోట్ల పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. జిల్లాలో 59 ఎంఈఓ పోస్టుల్లో ఒకరే(చిల్కూరు) రెగ్యులర్‌గా పని చేస్తుండగా మిగతా 58 మండలాల్లో ఇన్‌చార్జ్ ఎంఈఓలు ఉన్నారు. జిల్లాలో భువనగిరి డివిజన్ మినహా సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. కొన్నిచోట్ల సక్సెస్ పాఠశాలల్లో అదనపు తరగతులు లేకపోవడంతో చెట్లకిందే పాఠాలు చెబుతున్నారు.
ఎన్‌ఓసీ పొందని పాఠశాలలు..
ప్రైవేట్ పాఠశాలలు అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. పాఠశాల యాజమాన్యాలు ఏవిమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నా యి. ఏవరైనా ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేయాలం టే సంబంధిత పురపాలక సంఘం, పంచాయతీలతో పాటు విద్యాశాఖ, అగ్నిప్రమాద శాఖ నుండి అనుమతి తీసుకోవాలి. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఫైర్ ఎస్టీమ్ మిషన్ ఏర్పాటు చే సుకోవాలి. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రతి అగ్నిమాపక నిరోధక యంత్రంపై సదరు యాజమాన్యం అవగాహన క ల్గి ఉండాలి. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదా లు చోటు చేసుకుంటే అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు యాజమాన్యాలే నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉం టుంది. పాఠశాల భవనం చుట్టూ నాలుగు గజాల స్థలం ఉండాలి. ఎందుకంటే ప్రమాదం జరిగి నప్పుడు అగ్నిమాప క శకటం భవనం చుట్టూ తిరగాల్సిన అవసరముంటుంది.
ఆనారోగ్యం బారిన..
విద్యార్థులకు ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం పేరుతో ఆరోగ్య భద్రత కల్పించింది. ఈ పథకం కింద పిల్లలను పాఠశాలలో వైద్యులు పరిక్షించి అవసరమైన వారికి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవడం ముఖ్య ఉద్దేశం. అనేక పాఠశాలల్లో మొక్కుబడిగా ఈ పథకం కొనసాగుతుంది. కొన్ని చోట్ల వైద్య పరీక్షలే నిర్వహించడం లేదు. అలాగే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈవ్ టీజింగ్ గురికాకుండా చూడడమనేది పాఠశాలల బాధ్యత. కులం, మతం పరంగా వేధింపులకు గురికాకుండా చూడాలి.
బడి బస్సులు భద్రమేనా?
ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి ఏటా వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా.. బస్సుల విషయంలో నిబంధనలు పాటిం చడం లేదు. ప్రతి పాఠశాల బస్సు మే 15 లోగా ఆర్టీఓ అధికారుల దగ్గరికి తెచ్చి ఫిట్‌నెస్ ధ్రువపత్రం తీసుకోవాలి. బస్సు వేగంగా వెళ్లకుండా నిరోధకాలు బిగించాలి. పాఠశాలల బస్సులను గుర్తించే విధంగా పచ్చని రంగు వేయాలి. బస్సులో ప్ర థమ చికిత్స పెట్టె ఉండాలి. పిల్లలను దించేందుకు ఒక సహాయకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. డ్రైవర్ పేరిట ఆరోగ్యకార్డు ఉండాలి. 3 నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించి అందులో రాయాలి. వాహనం నడిపే డ్రైవ ర్‌కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కిటికిల చుట్టూ గ్రిల్ ఉండాలి.
Advertisement
Advertisement