శాస్త్రీయ అవగాహన అవసరం
శాస్త్రీయ అవగాహన అవసరం
Published Mon, Oct 17 2016 11:46 PM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM
బనగానపల్లె రూరల్: ప్రతి విద్యార్థికీ శాస్త్రీయ అంశాలపై అవగాహన ఉండాలని ఎస్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్, జిల్లా ఇన్‌స్పైర్ అవార్డ్సు పరిశీలకురాలు లక్ష్మీవాట్స్ అన్నారు. బనగానపల్లెలోని నెహ్రూ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్సు ఎగ్జిబిషన్ సోమవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం అలవాటు చేయడం వల్ల వారిలో కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. నమూనాల తయారీలో విద్యార్థులకు తోడ్పాటునందించిన ఉపాధ్యాయులను డోన్ డిప్యూటీ డీఈవో వెంకట్రామిరెడ్డి అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా సైన్స్ ఆఫీసర్ రామ్మోహన్, ఎంఈవో నాగమణి, నెహ్రూస్కూల్ కరస్పాండెంట్ కోడూరు హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి 30 నమూనాల ఎంపిక
జిల్లా స్థాయిలో జరిగిన ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో నంద్యాల, డోన్ డివిజన్‌ల నుంచి మొత్తం 300 నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో 30 నమూనాలను రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్సు ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేసిన్నట్లు లక్ష్మీవాట్స్ తెలిపారు.
Advertisement
Advertisement