వేములవాడ (కరీంనగర్) : వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. అందంగా అలంకరించిన వేదికపై వేడుక కన్నుల పండువగా సాగింది. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.