40 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం | Seized 40 quintals of ration rice | Sakshi
Sakshi News home page

40 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Published Mon, May 23 2016 9:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

40 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

40 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

మాచర్ల: పట్టణ శివారులోని రాయవరం జంక్షన్‌లో ఆదివారం ఉదయం జిల్లా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రెండు టాటా ఏసీ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. మాచర్లకు చెందిన ఇద్దరు రేషన్ బియ్యం వ్యాపారులు అక్రమంగా తరలించేందుకు వెల్దుర్తి మండలంలోని మండాది, ఉప్పలపాడు గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ వంశీధర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.

రెండు వాహనాల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించగా బియ్యాన్ని ఓరుగంటి మోహన్‌రెడ్డి, జమ్మలమడకకు చెందిన గంగనబోయిన శ్రీనివాసరావు తరలిస్తున్నారని సమాధానమిచ్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. వాహనాలను రూరల్ పోలీసులకు అప్పగించి, బియ్యాన్ని ఆర్.ఐ శ్రీధర్‌కుమార్, వీఆర్వోలకు అప్పగించామన్నారు. దాడిలో విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement