Ration rice smuggling
-
పేదల బియ్యంతో కోట్లకు పడగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం పట్టణ స్థాయిలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, కమీషన్ మీద అమ్ముకునే చిరుదందా సాగించిన ఓ వ్యక్తి ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను శాసించే బియ్యం లీడర్‌గా మారితే, రైస్ మిల్లులో పార్టనర్‌గా చేరి, ఆ రైస్ మిల్లుతో పాటు పలు ఇతర మిల్లులకు రేషన్ బియ్యం రీసైక్లింగ్ కోసం తరలించే లీడర్‌గా మరో వ్యక్తి మారి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ పక్కనున్న ఓ పారిశ్రామిక జిల్లాలో రేషన్ డీలర్ స్థాయి నుంచి డీలర్ల సంఘానికే నాయకుడిగా ఎదిగిన మరో వ్యక్తి.. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నాడు. ఇలా ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఇద్దరు చొప్పున రేషన్ బియ్యం దందా సాగించే ‘లీడర్లు’రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తున్న పేదల బియ్యానికి సవాల్ విసురుతున్నారు. ప్రతి నెలా రూ. వందల కోట్ల విలువైన పీడీఎస్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ ఈ దళారులు కోట్లు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి సహా పాత 10 జిల్లాల్లో కనీసంగా 20 మంది వ్యక్తులు ఈ బియ్యం దందాతో రూ. కోట్లు కూడబెట్టారని తెలుస్తోంది. లక్షల్లో మామూళ్లు .. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖల అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన పౌరసరఫరాల శాఖలోని జిల్లా స్థాయి అధికారుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని వివిధ హోదాల్లో ఉన్న వారి వరకు బియ్యం దందా సాగించే వారికి సహకారం అందిస్తున్నట్లు భావిస్తున్నారు. కాగా, మామూళ్లు ఇవ్వలేని గ్రామ, మండల స్థాయిలోని ఆటో ట్రాలీలను అప్పుడప్పుడు సీజ్ చేసి అధికారులు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులతోపాటు బియ్యం వాహనాలు రాష్ట్ర సరిహద్దులు దాటే మార్గంలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లను ఈ వ్యాపారులు మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, బియ్యం వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసే మరికొందరికి కూడా ఏనెలకు ఆనెల ఠంచన్‌గా మామూళ్లు ముడతాయని తెలుస్తోంది. మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి మొదలైన జిల్లాల నుంచి సిరోంచకు బియ్యం రవాణా చేసే ఓ ‘వీరుడు’మామూళ్ల కిందనే నెలకు రూ.10 లక్షలకు పైగా ముట్ట చెపుతాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇతనిపై 12 కేసుల వరకు ఉన్నాయి. ఈ వ్యక్తి కాళేశ్వరం, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఆస్తులు సంపాదించే స్థాయిలో బియ్యం దందా సాగిస్తున్నాడు. ఆసిఫాబాద్ రెబ్బెనకు చెందిన మరో ‘కిరణం’మీద 22 కేసులు ఉన్నప్పటికీ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ చుట్టుపక్కల మండలాల నుంచి బియ్యం సేకరించి బల్లార్షా ప్రాంతంలోని వీరూర్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన ఓ రైస్ మిల్లు భాగస్వాములు పీడీఎస్ బియ్యం దందాలో రాష్ట్రంలోనే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంగారెడ్డి జిల్లా నుంచి కర్ణాటకకు.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రేషన్ దుకాణం యజమాని సంఘం నాయకుడిగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దందా సాగిస్తూ ‘రాజు’గా వెలిగిపోతున్నాడు. ఈ నాయకుడు తను దందా చేయడమే గాక, బియ్యం దందా సాగించే కొందరు రేషన్ డీలర్లకు అండగా ఉంటున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాల నుంచి సేకరించిన బియ్యాన్ని కర్ణాటక సరిహద్దులు దాటిస్తూ కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ బియ్యం దందాకు మిల్లర్లతో పాటు అధికార పార్టీ నాయకుల అండ ఉన్నట్లు చెపుతున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల ప్రాంతంలోని నలుగురు ముఖ్యమైన వ్యక్తులు మక్తల్, నారాయణపేట మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రీసైక్లింగ్‌కే ఎక్కువ నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం దందా సాగించడంలో రైస్‌మిల్లర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్లతోపాటు కొంతమంది ఏజెంట్లు పేదల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకు కొంత మేర తరలిస్తుండగా భారీ ఎత్తున రైస్‌మిల్లులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఓ ఎమ్మెల్యేతోపాటు కీలకమైన ఓ రైస్‌మిల్లర్ హస్తముందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పండిస్తున్న సన్నరకాలను రైస్‌మిల్లర్లు ఏ గ్రేడ్ రకం కింద సేకరిస్తూ, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వాటి స్థానంలో ఏజెంట్లు, రేషన్‌డీలర్ల ద్వారా సేకరించిన ప్రజా పంపిణీ బియ్యాన్ని లెవీ కింద తిరిగి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని తెలుస్తోంది. రైస్‌మిల్లుల ద్వారా ఎఫ్‌సీఐకి, అక్కడి నుంచి రేషన్‌షాపులకు, లబ్ధిదారులకు చేరుతుండగా, తిరిగి వారి నుంచి ఏజెంట్ల ద్వారా మళ్లీ రైస్‌మిల్లులకే చేరుతుండడం గమనార్హం. మహబూబాబాద్‌లో ప్రజా ప్రతినిధి అండతో.. మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఉన్న మిల్లు, మరిపెడ మండలంలోని మరో రైస్ మిల్‌తో పాటు తొర్రూరు, కొత్తగూడ, కేసముద్రం కేంద్రాలుగా రేషన్ బియ్యం దందా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. సివిల్ సప్లై శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతూ వాటాలు నిర్ణయించి.. దందా సాఫీగా సాగేలా చూస్తున్నాడని తెలుస్తోంది. పీడీఎస్ డీలర్ల ద్వారా పేదల నుంచి కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు కొనుగోలు చేసి మామిడి తోటలు, రైస్ మిల్లులు, గోదాముల్లో దాచిపెడుతూ ఆ బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి హస్తం ఈ దందాలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
దొరికితేననే దొంగలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రేషన్‌బియ్యం అక్రమ రవాణా రూటు.. తీరు రెండూ మారిపోయాయి. మొన్నటి వరకు ఎంచుకున్న రూట్ల ద్వారా లారీల్లో బియ్యాన్ని అక్రమంగా కర్ణాటక సరిహద్దు దాటవేసిన అక్రమార్కులు కొన్నాళ్ల నుంచి తమ పంథాను మార్చుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నచిన్న గ్రామాల మీదుగా బొలెరోలు, డీఎంసీలు, టాటా ఏసీల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. పేదల బియ్యం అక్రమ తరలింపు విషయాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుంటోన్నా ఉమ్మడి జిల్లాలో మాత్రం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. సంబంధిత అధికారుల వైఫల్యం.. ఉదాసీనతతో పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జేబులను నింపుతోంది. మరోవైపు బియ్యం అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలున్నాయని.. అందుకే వారి జోలికి వెళ్లేందుకు పౌరసరఫరాలు..రెవెన్యూ.. పోలీసు అధికారులూ సాహసించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యానికి బదులు డబ్బులు.. ప్రస్తుతం చాలా మంది లబి్ధదారులు రేషన్ బియ్యం తినడం లేదు. దీంతో ప్రతి నెలా బియ్యం మిగిలిపోతోంది. దీన్ని గ్రహించిన కొంతమంది డీలర్లు వారిని కలిసి బియ్యం తీసుకున్నట్లు వేలిముద్ర వేయాలని అందుకు కిలో బియ్యానికి రూ.8 నుంచి రూ.10 చొప్పున ఇస్తామని మాట్లాడుకున్నారు. దీనికి లబ్ధిదారులు కూడా డీలర్లు చెప్పినట్టే చేస్తున్నారు. ఇలా లబి్ధదారుల నుంచి పొందిన బియ్యాన్ని పలువురు డీలర్లు తమ గోదాముల్లో దాచి పెట్టుకుని వాటిని రైస్‌మిల్లర్లు, దళారులకు కిలోకు రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. రెవెన్యూ, పౌరసరఫరాల అధికారుల తనిఖీల్లో ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆయా షాపుల్లో ఉండాల్సిన బియ్యం కంటే ఎక్కువగా ఉండడంతో అధికారులు ఆయా డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. కేవలం మహబూబ్‌నగర్ జిల్లాలోనే గడిచిన రెండు నెలల్లో 16మంది డీలర్ల డీలర్íÙప్ను ఇదే కారణంతో రద్దు చేయడం గమనార్హం. టాస్క్‌ఫోర్స్‌కు బ్రేక్? ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోరుగా కొనసాగుతున్న రేషన్‌బియ్యం అక్రమ రవాణాను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం నాలుగు నెలల క్రితం టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా అధికారులకు తెలియకుండానే హైదరాబాద్‌కు చెందిన పౌరసరఫరాల అధికారులు దాడులు నిర్వహించి కేసులు వేలాది క్వింటాళ్ల బియ్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. గద్వాల కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. టాస్‌్కఫోర్స్ అధికారుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన అక్రమార్కులు కొన్నాళ్లు తమ దందాను ఆపేద్దామనే నిర్ణయానికి వచ్చారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ గత రెండు నెలల నుంచి జిల్లాలో టాస్‌్కఫోర్స్ బృందం పత్తాలేకుండా పోయింది. దీంతో అక్రమార్కులు రూటు, తీరును మార్చుకుని బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. కేటీదొడ్డి మండలం నందిన్నె, గట్టు మండలం బొలిగేరి వద్ద చెక్‌పోస్టులు ఉండడం.. అక్కడ సీసీ కెమెరాలు ఉండడంతో ఇతర మార్గాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడ కిలోకు రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. వనపర్తిలో పీడీ యాక్ట్.. బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలనే డిమాండ్ బలంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉండడంతో మూడేళ్లుగా.. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ దందా చేస్తూ.. ఏడుసార్లు అధికారులకు, పోలీసులకు పట్టుబడ్డ వనపర్తి జిల్లా అమరచింత మండలానికి చెందిన దాసరి రాజశేఖర్‌పై ఎస్పీ అపూర్వరావు అక్టోబర్ 1వ తేదీన పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ నెల 10న ఈ విషయాన్ని పరిశీలించిన రాష్ట్ర పీడీ యాక్టు అడ్వైజరీ బోర్డు ఎస్పీ చర్యను సమరి్థస్తూ రాజశేఖర్‌కు మరో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. బియ్యం అక్రమ రవాణాలో గద్వాల కింగ్‌గా పేరొందిన ఓ మిల్లర్ విషయంలో అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తూకంలో మోసం చేస్తున్నారు మహబూబ్‌నగర్ జిల్లాలో రేషన్ డీలర్లు తూకంలో మోసం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. లబి్ధదారులకు తక్కువ తూకం వేసి మిగిలిన బియ్యాన్ని ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు. డీలర్లు తూకాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవు. లబి్ధదారులు మాకు ఫిర్యాదు చేయవచ్చు. – వనజాత, జిల్లా పౌరసరఫరాల అధికారి, మహబూబ్‌నగర్ గతంలో బియ్యం అక్రమ తరలింపు రూటు.. గద్వాల ధరూర్ అల్లాపాడు, కేటీదొడ్డి, నందిన్నె చెక్‌పోస్టుల మీదుగా కర్ణాటకలోని రాయచూర్‌లో ప్రవేశించేవి. ప్రస్తుతం తరలింపు రూటు ఆత్మకూరు డ్యాం నర్సన్‌దొడ్డి, దాగ్యదొడ్డి, నిలహళ్లి, పాతపాలెం, ఈర్లబండ, వెంకటాపురం, ఇర్కిచెడుల మీదుగా అర్తిగేరి కర్ణాటక సరిహద్దు సింగానేడులో ప్రవేశిస్తుంది. ∙గద్వాల, ధరూర్, అల్లపాడ్, మైలగడ్డ, రంగపురం, మల్లపురం, కుచినెర్ల సుల్తాన్పురంల మీదుగా కర్ణాటక బాపురంలో ప్రవేశిస్తుంది. మల్దకల్ నుంచి బీజ్వరం, పెంచికల్పాడు, రాయపురం, చింతకుంట మీదుగా కర్ణాటకలోని ఉండ్రాలు దొడ్డికు తరలిస్తున్నారు. (మహబూబ్‌నగర్, బిజినేపల్లి, కల్వకుర్తి నుంచి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం గద్వాలకు చేరవేస్తారు. అక్కడ బియ్యం మాఫియా కింగ్‌గా పేరొందిన ఓ మిల్లర్ ద్వారా పేదల బియ్యాన్ని కర్ణాటకు తరలిస్తున్నారు). -
డీలర్ల ట్రిక్కు...
కర్నూలు(సెంట్రల్) : ఇటీవల కర్నూలులోని బుధవార పేటలో 45 క్వింటాళ్ల బియ్యాన్ని మూడో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలోని అలంపూర్‌లో ఉన్న ఓ మిల్లుకు తరలిస్తున్నట్లు పట్టుబడిన హమాలీలు చెప్పారు. ♦ డోన్‌లో 80 క్వింటాళ్ల బియ్యం పట్టుబడి 20 రోజులైంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ♦ ఆళ్లగడ్డలోని ఓ గోదాములో ఉంచిన 120 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నారు. ..ఇలా చెప్పుకుంటూ పోతే రోజూ జిల్లాలోని ఏదో మూలన రేషన్ బియ్యం పట్టుబడుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి ఎంఎల్ఎస్(మండల లెవల్ స్టాక్)పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేసే వాహనాలను జీపీఆర్ఎస్ ద్వారాఅనుసంధానం చేసి రవాణా చేస్తారు. పౌర సరఫరా దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాటాకు ఈ–పాస్ మిషన్లతో అనుసంధానం చేసి పేదలకు బియ్యంతో సహా ఇతర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా అక్రమాలకు తావు ఇవ్వకుండా ప్రజా పంపిణీ సరుకులను లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నా బియ్యం దొంగలు మాత్రం తమ అక్రమ వ్యాపారాన్ని ఎంచక్కాగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతీ నెలలో సుమారు 4.5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. డీలర్ల ట్రిక్కు... కర్నూలు జిల్లాలో 2,346 రేషన్‌దుకాణాల పరిధిలో 11,71956 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా 19,120.975 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు బియ్యం పక్కదారి పడుతోంది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరన్నా నానుడి చందంగా రేషన్ దుకాణాల డీలర్లే ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ–పాస్ మిషన్ ద్వారా రేషన్ బియ్యాన్ని ఇస్తున్నా వక్రమార్గం ఎంచుకుంటున్నారు. మామూలుగా అయితే వినియోగదారులు బియ్యం కోసం తెచ్చిన సంచిని కూడా కాట వేసి దానిని బరువుకు సరితూగు బియ్యాన్ని వేయాలి. అయితే ఇక్కడి పరిస్థితులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముకుంటాయి. మొదట ఈపాస్ మిషన్ కోసం సంచితోపాటు తూకం వేస్తారు. ఆ వెంటనే మళ్లీ రెండు, మూడు కేజీల బరువున్న బొలెలు/ గిన్నెలు/ బక్కెట్లను పెట్టిమళ్లీ తూకం వేస్తారు. ఇలా పది కేజీలకు ఒకసారి తూకం తీసుకుంటారు. అంటే ఒక్క 20 కేజీల రేషన్ కార్డుకు దాదాపు 4 కేజీల వరకు బియ్యం తూకంలో మాయం అవుతుంది. ఇలా నూరు కేజీలకు 20 కేజీల బియ్యం డీలర్ ఖాతాలో చేరుతుంది. ఒక మెట్రిక్ టన్నుకు 200 క్వింటాల ప్రకారం వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలోని 19,121.975 మెట్రిక్ టన్నుల బియ్యానికి 3,824.2 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్ల దగ్గర మాయవుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ అదే తంతు... మరోవైపు మండల లెవల్ స్టాక్ పాయింట్లలోనూ బియ్యం భారీగానే మాయవుతోంది. ఇక్కడికీ వచ్చిపోయే రవాణా సరుకు లారీలను తూకం వేసి పంపుతున్నా తూకాల్లో మాత్రం తేడాలు వస్తున్నాయి. అంతేకాక ఇక్కడ లారీల లారీల సరుకు పందికొక్కుల పాలవుతున్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. క్వింటానికి నాలుగైదు కేజీల తరుగు వస్తోందని డీలర్లు బహిరంగానే చెబుతుఆన్నరు. క్వింటానికి నాలుగు కేజీల ప్రకారం అనుకున్నా మెట్రిక్కు టన్నుకు 40 కేజీలు, 19121 మెట్రిక్ టన్నులకు 764.84 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ కరువు... డీలర్లు, ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం పక్కదారి పడుతున్నట్లు పౌర సరఫరాల అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు ఉంటారు. తూకాల్లో మోసాలను వారు మామూలుగానే పరిగణిస్తారు. ఒక డీలర్ బియ్యాన్ని తీసుకెళ్లితే మధ్య మధ్యలో అధికారులు తనిఖీ చేసి చూడాలి. రేషన్‌కార్డులు, పంపిణీ చేసిన బియ్యానికి లెక్కలను పరిగణలోకి తీసుకొని సరిౖయెనా స్టాక్ఉందోలేదో చూడాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్వో, ఆర్ఐలు పర్యవేక్షించాలి. అయితే అలాంటి పర్యవేక్షణా ఎక్కడా కనిపించదు. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా బియ్యాన్ని పక్కదారి పట్టించు సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లలో అయితే కొందరు అధికారులే పాత్రదారులు. రేషన్ బియ్యం పట్టివేత కర్నూలు : చౌక డిపోల ద్వారా తెల్లకార్డుదారులకు సరఫరా చేయాల్సిన సబ్సిడీ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తుండగా రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన కురువ సుంకమ్మ, కర్నూలు మండలం నిర్జూరు గ్రామానికి చెందిన కురువ జగదీశ్ తదితరులు 30 బస్తాల రేషన్ బియ్యాన్ని బోలేరో వాహనంలో తీసుకువెళ్తుండగా గురువారం సాయంత్రం రెండో పట్టణ పోలీసులు దర్మపేట సర్కిల్ వద్ద తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. తూకాల్లో మోసం చేస్తే చర్యలు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు. తూకాల్లో మోసాలు చేస్తే షాపును సీజ్ చేస్తాం. ఇలాంటి సంఘటలపై ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అనుమానం వస్తే తనిఖీలు నిర్వహిస్తున్నాం. – పద్మశ్రీ , డీఎస్ఓ -
పేదల బియ్యం... పెద్దోళ్లకు వరం
గుంటూరు వెస్ట్: బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తోందని తెలిసి గుంటూరు జిల్లా నరసరావుపేటలో సోదాలకెళ్లిన పౌర సరఫరాల అధికారులను ఓ ప్రముఖ నాయకుడి కుమారుడు బియ్యం గోడౌన్లోనే నిర్బంధిస్తే.. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే గాని వారిని విడుదల చేయలేని దుస్థితి.. లారీ నిండా ఉన్న పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సంగతి తెలుసుకుని ఆ లారీని గురజాల ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌కు అధికారులు తీసుకెళ్తే .. పోలీసులను సైతం బెదిరించి దానిని తన అడ్డాకు తరలించుకుపోయాడు మరోనాయకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా... లెక్కకు మించిన ఉదాహరణలు. పల్నాడు ప్రాంతంలో గత టీడీపీ నాయకుల దాష్టీకాలపై కనీసం ఫిర్యాదు చేసే అవకాశం కూడా ప్రజలకు లేకుండా పోయింది. టీడీపీ నేతల అరాచకాలపై విసిగిపోయిన ప్రజలు ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఇలాఖాలోనే ఈ దోపిడీ జరగడం విశేషం. నెలకు రూ.20 కోట్లకు పైగానే తినేశారు పల్నాడు ప్రాంతంలో దాదాపు 30 శాతం రేషన్ బియ్యం కేవలం కొందరు నాయకుల చేతిలోకి వెళుతోంది. దీని విలువ దాదాపు రూ.20 కోట్లు పైమాటే. ఈ బియ్యాన్ని నాయకులు ఇతర రాష్ట్రాలకే కాకుండా, కృష్ణపట్నం, కాకినాడు పోర్టులగుండా విదేశాలకు తరలిస్తున్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. ఈ అక్రమ బియ్యాన్ని గతంలో ముట్టుకోవాలన్నా అధికారులు భయపడే పరిస్థితి. మరీ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే అసలు రేషన్ దుకాణం నిర్వహించే నిజమైన యజమాని కూడా ఉండకుండా అక్రమార్కులే నేరుగా మొత్తం బియ్యాన్ని కాజేస్తున్న వైనాన్ని కూడా రాష్ట్ర అధికారులు గుర్తించారు. దాడులను ఉధృతం చేసిన అధికారులు రెండు నెలల నుంచి జిల్లా పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖాధికారులు సమన్వయంతో అక్రమ బియ్యం నిల్వలు, రవాణాపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.2 కోట్ల 82 లక్షలకు పైగా విలువైన 337 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వందమందికి పైగా 6ఎ కేసులు నమోదు చేశారు. వీటిలో అధిక సంఖ్యలో పల్నాండు ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం. దాడులు కొనసాగుతాయి పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు కాజేస్తామంటే ఊరుకునేది లేదు. ఇప్పటికే అనేక మందిపై దాడులు చేశాం. రానున్న కాలంలో మరిన్ని దాడులు కొనసాగుతాయి. – టి.శివరామ్ ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి -
ఈ–పాస్, ఐరిస్‌తో రూ. 917 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: ఈ–పాస్, ఐరిస్ విధానంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని, ఈ ఏడాది కాలంలో ప్రభుత్వానికి రూ. 917 కోట్ల విలువ చేసే 3.52 లక్షల టన్నుల బియ్యం ఆదా అయిందని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఈపాస్, ఐరిస్ విధానం ద్వారా ప్రతి నెలా 15 నుంచి 20% వరకు బియ్యం మిగులు ఉందని వెల్లడించారు. పౌరసరఫరాల భవన్లో రేషన్ డీలర్లతో కమిషనర్ శనివారం నిర్వహించిన సమావేశంలో సబర్వాల్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి నెలా అర్హులైన 2.83 కోట్లమందికి వేల కోట్ల రూపాయల సబ్సిడీతో కిలో రూపాయి చొప్పున 6 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు, రేషన్ డీలర్లు కలసి బియ్యాన్ని అక్రమార్కులకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణాకు సహకరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ రాందాస్‌కు ప్రత్యేక బాధ్యత లు అప్పగించామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా టాస్క్‌ఫోర్స్ బృందాలకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతి నెలా రేషన్ షాపుల్లో జరిగే లావాదేవీలపై ఈ బృందాలు నిఘా పెట్టి, రైస్ మిల్లులను తనిఖీ చేస్తాయని చెప్పారు. -
పేదల బియ్యం పక్కదారి
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పడుతోంది. పేదల బియ్యం మళ్లీ దారిమళ్లుతున్నాయి. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్ ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుండడంతో బియ్యం బకాసురులు కొత్త పంథాను ఎంచుకున్నారు. లబ్ధిదారులకు డబ్బు ఆశ చూపి బియ్యాన్ని వారినుంచే తన్నుకు పోతున్నారు. పేదలతో పాటు మధ్య తరగతి వారు కూడా ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులుగా ఉండడం అక్రమార్కులకు మరింత కలసి వస్తోంది. వాస్తవంగా మధ్య తరగతి ప్రజలు చౌక బియాన్ని తీసుకోవడానికి ఇష్ట పడడంలేదు. ఒకవేళ బియ్యం తీసుకున్నా వాడుకోవడం లేదన్నదిబహిరంగ రహస్యమే. దీంతో వారు కార్డుపై తీసుకున్న బియ్యాన్ని కేజీకి రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. చిరు వ్యాపారులు ఏకంగా ఆటోలను కాలనీల్లో తిప్పుతూ బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు. ఒక్కో ఇంట్లో సుమారు 20 నుంచి 30 కిలోల వరకు చౌక బియ్యం లభిస్తుండడంతో ఇంటింటికీ ఆటోలు తీసుకువెళ్లి వాటిని సేకరిస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని బస్తాల్లో నింపి పెద్ద వ్యాపారులకు కిలోకు రూ.12 నుంచి రూ.15 ధరకు విక్రయిస్తున్నారు. వారు వాటిని కర్ణాటక, మహారాష్ట్రలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ప్రభుత్వం ఒక కేజీ బియ్యాన్ని కొనేందుకు రూ.23 వరకూ వెచ్చిస్తోంది. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాయితీపై రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. నగర శివార్లలోనే దందా గ్రేటర్ నగర శివార్లలోనే చౌక బియ్యం కొనుగోళ్ల దందా అధికంగా జరగుతునట్లు సమాచారం. ఇటీవల నగర శివారులో పౌరసరఫరాల విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించగా పొరుగు రాష్ట్రాలకు తరులుతున్న చౌక బియ్యం బస్తాలు పట్టుబడ్డాయి. నగర పరిధిలోనూ బియ్యాన్ని సేకరించి ఆ తరవాత వాటిని ఆటోల్లో ఒకచోట చేర్చి అక్కడి నుంచి డీసీఎం వాహనాల్లో పొరుగు రాష్ట్రాలకు పంపించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మహేశ్వరం వద్ద 9 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. గ్రేటర్ పరిధిలో ఇదీ పరిస్థితి.. హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రతినెలా చౌకదుకాణాల ద్వారా సుమారు 11 లక్షలకు పైగా ఆహార భద్రత లబ్ధి కుటుంబాలకు సుమారు 30 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యం ఒక రూపాయి చొప్పున కుటుంబంలో ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అన్ని ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం కోటా కేటాయిస్తోంది. వాస్తవంగా నిరుపేద కుటుంబాలకు చౌక బియ్యం పంపిణీ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అయితే మధ్య తరగతి కుటుంబాలు మాత్రం దుర్వినియోగానికి పాల్పుడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో ఈ–పాస్ అమలుకు ముందు డీలర్లు చేతివాటం ప్రదర్శించి బియ్యాన్ని పక్కదారి పట్టించేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ–పాస్ అమలు అనంతరం బియ్యం కోటాలో దాదాపు 20 నుంచి 35 శాతం మేర ఆదా అయింది. అంటే కార్డుదారులు కచ్చితంగా చౌక దుకాణానికి వచ్చి వేలిముద్ర వేసిన తర్వాత మాత్రమే బియ్యం తీసుకునేలా ఏర్పాటు చేయడంతో అక్రమాలకు తెరపడింది. బియ్యాన్ని తరలించే వాహనాలను కూడా జీపీఆర్ఎస్ ద్వారా పర్యవేక్షించే పద్ధతి అమలు చేయడం వల్ల గోదాముల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యాన్ని తరలించేప్పుడు జరిగే అక్రమాలను కట్టడి చేశారు. నిబం«ధనల ప్రకారం చౌక బియ్యం కొనడం.. అమ్మడం నేరం. వాస్తవంగా కొందరు లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోతే ఆహారభద్రత కార్డు రద్దవుతుందన్న భయంతో అవసరం లేకపోయినా బియ్యం తీసుకుంటున్నారు. అలా తీసుకున్న బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే, కార్డుదారులు బియ్యం తీసుకోకపోయినా రేషన్ కార్డు రద్దు కాదని, ఎలాంటి సందేహం అవసరం లేదని పౌరసరఫరాల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సరిహద్దులు దాటుతున్న ‘సర్కారు బియ్యం’
సాక్షి కడప : ప్రభుత్వం పేదలకు అందించే నిత్యావసరాల్లో ఒకటైన రేషన్ బియ్యం అక్రమార్కుల పాలవుతున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన కొందరితోపాటు జిల్లాకు చెందిన చాలామంది రేషన్ బియ్యం వ్యాపారానికి తెర తీశారు. ప్రతినెల 15 నుంచి 25వ తేదీ వరకు వీధుల్లో తిరుగుతూ బియ్యం కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రేషన్‌కు సంబంధించి బియ్యం ప్రతినిత్యం సరిహద్దులు దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం..అధికారులు చూసీచూడనట్లు వదిలి వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం సాగుతోంది. నిఘా ఉంచి అక్రమార్కులను పట్టుకుంటే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మైదుకూరు ప్రాంతం నుంచే అధికంగా జిల్లాలోని మైదుకూరు ప్రాంతం నుంచి గుంతకల్లు, గుత్తి, అనంతపురం, కడప తదితర ప్రాం తాలకు చెందిన వ్యాపారులు అధికంగా కొనుగోలు చేసి సరిహద్దులు దాటిస్తున్నారు. సరుకును ఎక్కువగా అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ గోడౌన్లు, హోటళ్లకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బెంగళూరులో అధిక ధరకు అమ్ముకుంటూ ఏలాగోలాగా సొమ్ము చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. మైదుకూరుతో పాటు పులివెం దుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడపల నుంచి కూడా సరుకు వెళుతుండగా,జిల్లాలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా ఎక్కడికక్కడ వ్యాపారులకు అందిస్తే రాత్రికి రాత్రే సరుకు రవాణా సాగుతోంది. పైగా ఏదో ఒక ప్రాంతంలో రేషన్ బియ్యం పట్టుకుంటూ కేసులు కూడా నమోదవుతున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. రైలులో రవాణా గతంలో ప్రత్యేక వాహనాల ద్వారా కదిరి, బెంగళూరు తదితర ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని తరలించేవారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు కూడా సరుకు రవాణాకు వాహనాన్ని సమకూర్చుకుని వచ్చేవారు. అయితే తనిఖీలు జరుగుతుండడంతో తర్వాత బస్సులు, ఆటోలు, జీపుల్లో ఎవరికీ అనుమానం రాకుండా తరలించేవారు. అయితే ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్న ఆలోచనతో రైలులో అయితే ఇబ్బందులు ఉండవని భావించి రవాణాకు మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కువగా ఇంటర్సిటీ రైలులో కడప నుంచి గుంతకల్లు, గుత్తి, బళ్లారి, హుబ్లీ తదితర ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. ఇంటర్సిటీ అయితే ప్రతి బాక్సు ఖాళీగా ఉంటుంది కాబట్టి సీట్ల కింద మూటలు వేసి అక్రమార్కులు లాగిస్తున్నారు. అందులోనూ ఒకరిద్దరు కాకుండా బృందాలుగా ఉంటూ పెద్ద ఎత్తున రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్నారు. వీరు కొంతమంది టీటీఈలు, రైల్వే పోలీసులకు సమాచారం తెలిసినా అమ్యామ్యాల ద్వారా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. వాళ్లతో పరిచయాలు కూడా ఉండడంతో రావడం, తృణమో, ఫణమో పుచ్చుకోవడం, ఏమి తెలియనట్లు వెళ్లిపోతుండడం కనిపిస్తోంది. ఏది ఏమైనా అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూతోపాటు పౌరసరఫరాలశాఖ, పోలీసు అధికారులు ఈ విషయంగా ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమార్కుల వ్యవహారం బట్టబయలయ్యే అవకాశం లేకపోలేదు. కిలో రూ. 10తో కొనుగోలు జిల్లాలో ఎక్కడ చూసినా రేషన్‌షాపుల్లో తెచ్చుకున్న బియ్యాన్ని కిలో రూ. 10తో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. డీలర్షాపుల వద్ద కార్డుదారులు కిలో రూపాయితో కొనుగోలు చేసి రూ. 10కు అమ్ముకుంటున్నారు. ఒకచోట కాదు..జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల ఈ కొనుగోలు వ్యవహారం జోరుగా సాగుతోంది. రేషన్‌షాపుల్లో ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకుల పంపిణీ సాగుతోంది. తర్వాత పది రోజుల వ్యవధిలో ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారు.అందులోనూ కొంతమంది డీలర్లు కూడా అధికారులతో కుమ్మక్కై ఎన్నో కొన్ని వినియోగదారుల నుంచి తూకంలో తగ్గించుకుని మిగుల్చుకున్నయో లేక తమ చేతివాటాన్ని ప్రదర్శించి దక్కిన బియ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటుండగా... మరికొంతమంది రేషన్‌కార్డుదారుల నుంచి కూడా కొనుగోలు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. -
మార్కాపురం టు కాకినాడ!
ప్రకాశం, మార్కాపురం: పశ్చిమ ప్రకాశంలో పేదలకు దక్కాల్సిన సబ్సిడీ బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. ఈ వ్యాపారం కొందరు డీలర్లకు అక్రమ ఆదాయానికి మార్గంగా మారింది. ఇక్కడ సేకరించిన రేషన్ బియ్యం లారీల్లో అనంతపురం, కాకినాడ పోర్టుకు చేర్చి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కిలో రూపాయి ప్రకారం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం బయట సుమారు రూ.25 చెల్లించి కొనుగోలు చేస్తోంది. మార్కాపురం నుంచి నంద్యాల మీదుగా అనంతపురం, యర్రగొండపాలెం నుంచి కోస్తా జిల్లాలకు అక్రమంగా రవాణా అవుతోంది. మొత్తం మీద నెలకు 1000 బస్తాల బియ్యాన్ని తరలిస్తున్నారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెంలలో పౌరసరఫరాల శాఖ గోడౌన్లు ఉన్నాయి. మార్కాపురం గోడౌన్ నుంచి మార్కాపురం పట్టణ, రూరల్, పెద్దారవీడు, పెద్దదోర్నాల, తర్లుపాడు మండలాల్లోని రేషన్ దుకాణాలకు, గిద్దలూరు గోడౌన్ నుంచి గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలకు, కంభం గోడౌన్ నుంచి కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు, యర్రగొండపాలెం గోడౌన్ నుంచి యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి సివిల్ సప్లయ్ గోడౌన్లకు చేరుస్తారు. అక్కడి నుంచి ఆయా గ్రామాల్లోని రేషన్ షాపులకు తరలిస్తారు. త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, కంభం, మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో కొంత మంది డీలర్లు రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని రైసు మిల్లుల ద్వారా లెవి రూపంలో మళ్లీ ప్రభుత్వానికి సుమారు రూ.22లకు అమ్ముతున్నారు. మరికొంత మంది వ్యాపారులు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, ద్వారక తిరుమల దేవస్థానాల్లోని కాంట్రాక్టర్లకు నిత్యాన్నదానానికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. అక్రమాలు జరుగుతోందిలా.. బియ్యం నాణ్యంగా లేకపోవటంతో కొందరు కార్డుదారులు తీసుకోవడం లేదు. మరికొంత మందికి డీలర్లు ఇవ్వడం లేదు. ప్రతి మండలం నుంచి సుమారు 50 బస్తాల బియ్యం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. డివిజన్లోని 12 మండలాలతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో కూడా వ్యాపారులు బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఈ పాస్ విధానం వచ్చినా అక్రమాలు ఆగటం లేదు. బయోమెట్రిక్ విధానంలో డీలర్లు కార్డుదారుల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నారు. అక్రమ రవాణా ఇలా.. మార్కాపురం ప్రాంతంలో కొనుగోలు చేసిన బియ్యాన్ని మార్కాపురం, తర్లుపాడు, కంభం, గిద్దలూరు రైల్వేస్టేషన్లలో రైళ్లు, లారీల నుంచి నంద్యాల, అనంతపురానికి చేరుస్తున్నారు. మరికొన్ని బియ్యాన్ని కోస్తా జిల్లాలకు చేర్చి అక్కడి నుంచి పోర్టులకు తరలించి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. రేషన్ డీలర్ల నుంచి వ్యాపారులు బియ్యాన్ని కొనుగోలు చేసి పట్టణ శివారు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచి రాత్రి పూట తరలిస్తున్నారు. ఇలా తరలించిన బియ్యాన్ని నంద్యాల, అనంతపురం ప్రాంతాల్లో పాలీష్ పెట్టి మళ్లీ సన్న బియ్యంగా ప్రజలకు అమ్ముతున్నారు. ఇటీవల నమోదైన కేసులు ♦ గతేడాది జూలై 2వ తేదీన తర్లుపాడు బాలాజీ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 349 బస్తాల బియ్యాన్ని (ఒక్కో బస్తా 50 కేజీలు) స్వాధీనం చేసుకున్నారు. ♦ గతేడాది జూలై 6న మార్కాపురం పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీ వద్ద ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 310 బస్తాల రేషన్ బియ్యాన్ని, రూ.1.02 లక్షల నగదు, లారీని పోలీసులు సీజ్ చేశారు. ♦ జూలై 11న పట్టణ శివార్లలోని ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉన్న గోడౌన్లో పోలీసులు దాడులు చేసి 485 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ♦ గతేడాది జూన్, జూలైల్లో తర్లుపాడు మండలం తుమ్మలచెరువులో అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ♦ ఈ ఏడాది జనవరి 9వ తేదీ అర్ధరాత్రి ఒకటిన్నర గంట సమయంలో భగత్‌సింగ్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 500 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 513 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జరిగింది. విజిలెన్స్ సీఐలు బీటీ నాయక్, అజయ్‌కుమార్, పట్టణ ఎస్ఐ కోటయ్యలు పట్టణంలోని కరెంట్ ఆఫీసు వెనుక ఉన్న భగత్‌సింగ్ కాలనీలోని సబ్బుల ఫ్యాక్టరీపై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 513 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిర్వాహకుడైన పి.హనుమంతురావుపై కేసు నమోదు చేశారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న విజిలెన్స్
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం వాహనంతో పాటు రూ.3.68 లక్షల విలువైన 16 టన్నుల రేషన్ బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకుని ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన తిమ్మాపురంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విజిలెన్స్ సీఐ ఎన్వీ.భాస్కర్ కథనం ప్రకారం ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంకు అక్రమంగా రేషన్ బియ్యం తరలివెళుతుందన్న సమాచారాన్ని అందుకున్న విజిలెన్స్ అధికారులు మండలంలోని తిమ్మాపురం వద్ద కాపు కాశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా మంగలగూడెంకు చెందిన శ్రీరంగం సత్యం, శివనాగుల శ్రీనులకు చెందిన రేషన్ బియ్యం లోడు లారీని ఆపి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 16 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళుతుండడాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాహనంతో సహా సరుకును సీజ్ చేశారు. అనంతరం లారీ డ్రైవర్ వేముల ఎల్లయ్యను అరెస్ట్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేశారు.ఆ తరువాత కామవరపుకోట డెప్యూటీ తహసీల్దార్ ఆర్వీ.మురళీకృష్ణ, వీఆర్వో లక్ష్మీపతి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో అప్పగించారు. దీనిపై విజిలెన్స్ సీఐ భాస్కర్ మాట్లాడుతూ లారీ డ్రైవర్ ఎల్లయ్య రెండు నెలల క్రితం రేషన్ బియ్యాన్ని తరలిస్తూ దేవరపల్లిలో తమ చేతికి చిక్కాడన్నారు. మళ్లీ ఇప్పుడు దొరికాడన్నారు. ఈ దాడిలో విజిలెన్స్ ఎస్సై కె.సీతారాము తదితరులు పాల్గొన్నారు. -
విదేశాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా
కృష్ణాజిల్లా, కావలి: కృష్ణపట్నం పోర్టు మీదుగా విదేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరుపేట మాఫియాకు చెందిన టర్బో లారీని కావలి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. కావలి వన్‌టౌన్ సీఐ ఎం.రోశయ్య, బిట్రగుంట ఎస్సై నాగభూషణం కోల్కత్తా– చెన్నై జాతీయరహదారిపై కావలి రూరల్ మండలం గౌరవం టోల్‌ప్లాజా వద్ద వేకువ జామున 3 గంటల ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో చిలకలూరిపేట నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఏపీ27టీటీ 2745 టర్బో లారీలో నకిలీ వే బిల్లులతో అక్రమంగా 27.5 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండడాన్ని గుర్తించి పట్టుకున్నారు. లారీ డ్రైవర్ పాశం రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. టోల్గేట్ కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి కావడంతో లారీ, డ్రైవర్‌ను కావలి రూరల్ పోలీసులకు అప్పగించారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రేషన్ బియ్యం మాఫియాగా మారిన టీడీపీ చోటా నేతలు పోలీసుల విచారణలో కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మాఫియా వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం కారుసూల గ్రామానికి చెందిన ఐలవరపు నాగేశ్వరరావు, నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సలిసం శ్రీనివాసరావు గ్రామస్థాయి టీడీపీ నాయకులు. వీరిద్దరూ కలిసి రేషన్‌బియ్యం అక్రమ తరలింపు వ్యాపారం సాగిస్తున్నట్లుగా సమాచారం. చిలకలూరిపేట నియోజకవర్గంలోని రేషన్‌షాపుల డీలర్ల నుంచి ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని కిలో రూ.12 వంతున కొనుగోలు చేసి 50కిలోల బస్తాల్లోకి మార్చి రహస్య ప్రదేశంలో డంపింగ్ చేస్తారు. గతంలో బియ్యాన్ని టర్బో లారీలకు 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు లోడు చేసి కాకినాడు పోర్టుకు తరలించేవారు. పోర్టుకు బియ్యాన్ని తరలించగానే టీడీపీ చోటా నేతలకు కిలోకు రూ.19 చొప్పున నగదు అందుతుంది. ఈ లెక్కన లోడుకు రూ.4.75 లక్షల నుంచి రూ.5.70 లక్షల వరకు నగదు చేతికందుతున్నట్లు సమాచారం. ఇక పోర్టు నుంచి ఇతర దేశాలకు బియ్యాన్ని తరలించే ముఠా కంటైనర్లలో లోడింగ్ చేసి ఓడల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. ఇలా నెలకు 40 నుంచి 50 టర్బో లారీల్లో రేషన్‌బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ వే బిల్లులతో టీడీపీ చోట నేతలు నెలకు రూ.2 కోట్లకుపైగానే వ్యాపారం సాగిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల కాకినాడు పోర్టుకు రేషన్ బియ్యం తరలించడం కుదరకపోవడంతో కృష్ణపట్నం పోర్టును కేంద్రంగా చేసుకుని రవాణా సాగిస్తున్నట్లుగా సమాచారం. కాగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట శాసనసభ్యుడే కావడం గమనార్హం. -
పేదల పొట్ట నింపాల్సిన బియ్యం అవినీతి పుట్టలో..
ఒకటి రెండు క్వింటాళ్లు కాదు.. ఏకంగా 96 టన్నుల రేషన్ బియ్యం.. వేలాదిమంది పేదల కడుపు నింపాల్సిన ఆ బియ్యం అవినీతి పుట్టలో దాక్కున్నాయి.. రేషన్ షాపుల్లో ఉండాల్సిన సరుకును దారి తప్పించి.. బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు ఆనందపురంలోని ఓ రైస్ మిల్లులో దాచారు. విజిలెన్స్ దాడుల్లో ఈ అక్రమం గుట్టు రట్టయ్యింది. విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న ఈ బియ్యం విలువ రూ.30 లక్షలు. ఆనందపురం (భీమిలి): ఆనందపురం మండలం పెద్దిపాలెంలోని సాయి బాలాజీ రైస్ మిల్లులోని రేషన్ బియ్యాన్ని చూసి విజిలెన్స్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇది మిల్లా... లేక పీడీఎస్ బియ్యం నిల్వ చేసే గొడౌనా అన్నంతగా అక్కడ నిల్వలు ఉండడంతో అవాక్కైపోయారు. సుమారు 30 లక్షల విలువ చేసే 96 టన్నుల పీడీఎస్ బియ్యం విజిలెన్స్ అధికారుల దాడిలో వెలుగుచూశాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన విజిలెన్స్ తనిఖీలు రాత్రి వరకు కొనసాగుతునే ఉన్నాయి. విజిలెన్స్ ఎస్పీ డి.కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దిపాలెంలో ఉన్న సాయి బాలాజీ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు కొంత మంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి నుంచే విజిలెన్స్ అధికారులు ఆ మిల్లు పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున ఐదు ఆటోలలో బియ్యం బస్తాలను మిల్లులోకి తరలిస్తుండగా మాటువేసిన విజిలెన్స్ అధికారులు పట్టుకొని విచారించారు. ఆ ఆటోలలో ఉన్న నాలుగు టన్నుల బియ్యం రేషన్ బియ్యంగా గుర్తించారు. ఈ మేరకు ఆటోలతో పాటు బియ్యాన్ని సీజ్ చేశారు. ఆటోలు తీసుకొచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే విజిలెన్స్ డీఎస్పీ పి.ఎం.నాయుడు, సీఐలు శ్రీనివాస్, మల్లిఖార్జునరావు, సిబ్బంది మిల్లులోకి నేరుగా ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న బియ్యం నిల్వలను తనిఖీ చేయగా పీడీఎస్ బియ్యంగా నిర్ధారణయింది. రేషన్ బియ్యాన్ని పాలిస్ చేసి గోనె సంచెలలో ప్యాక్ చేసి సూపర్ ఫైన్ బియ్యంగా విక్రయించడానికి సిద్ధం చేసిన నిల్వలు తనిఖీలో పట్టుబడ్డాయి. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు సాయంత్రం వరకు చేపట్టిన లెక్కలు ప్రకారం మొత్తం 96 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధారించారు. రైసు మిల్లులో రాత్రి వరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ పట్టుబడిన బియ్యం రూ.30 లక్షలు విలువ చేస్తాయన్నారు. మొత్తం మిల్లు అంతా సోదాలు జరుపుతున్నామని, ఇంకా అక్రమ నిల్వలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పీడీఎస్ బియ్యం ఎక్కడ నుంచి వస్తున్నాయన్న విషయమై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. బియ్యం తరలించడానికి వినియోగిస్తున్న వాహనాల పర్మిట్లను రద్దు చేస్తామన్నారు. మిల్లు యజమాని చెన్నా శ్రావణితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. మిల్లుకి బియ్యం తీసుకొచ్చిన ఐదు ఆటోలను సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారుల వెంట డీటీవో రేవతి, పౌరసరఫరాల శాఖ తహసీల్దారు సుమబాల, సీఎస్‌డీటీ జయ, ఆర్ఐ వరలక్ష్మి, వీఆర్వో పి.వెంకట అప్పారావు ఉన్నారు. -
తండ్రీకొడుకుల ‘బియ్యం’ దందా
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు చేస్తున్న రేషన్‌బియ్యం దందాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. సివిల్ సప్లై అధికారులతో కలిసి చేసిన దాడుల్లో ఇద్దరిని పట్టుకుని, ఆరు క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం తెలిపారు. భోలక్‌పూర్‌కు చెందిన తండ్రీకుమారులు అహ్మద్ అలీ, సర్ఫరాజ్ అలీ తోలు వ్యాపారం చేసేవారు. ఇందులో నష్టం రావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం బియ్యం దందా ప్రారంభించారు. ముషీరాబాద్, భోలక్‌పూర్, గాంధీనగర్, వారాసిగూడ ప్రాంతాలకు చెందిన వినియోగదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కేజీ రూ.8 చొప్పున ఖరీదు చేసే వారు. వీటిని గూడ్స్ ఆటోలో జహీరాబాద్‌కు తరలించి అక్కడ కేజీ రూ.15కు విక్రయిస్తూ సొమ్ము చేసుకునే వారు. దీనిపై సమాచారం అందడంతో మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం సివిల్ సప్ లై అధికారులతో కలిసి శుక్రవారం వీరి గోదాంపై దాడి చేసింది. ఆరు క్వింటాళ్ల బియ్యం, ఆటోను స్వాధీనం చేసుకుంది. కేసును తదుపరి చర్యల నిమిత్తం గాంధీనగర్ పోలీసులకు అప్పగించింది. గుట్కా రాకెట్ గుట్టు రట్టు ముషీరాబాద్‌లోని అంబిక స్టోర్స్‌పై దాడి చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నిషేధించడంతో ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో గాంధీనగర్, నాంపల్లి, టోలిచౌకి, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన డి.మోహన్‌కుమార్, ఎండీ సాహుల్, మహ్మద్ ఫారూఖ్, ఎం.మహేష్, బి.శ్రీధర్, ఎండీ ఖాలీద్ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. తనకు చెందిన అంబిక స్టోర్స్ ద్వారా మోహన్ భారీగా గుట్కా విక్రయా లు చేస్తున్నాడు. దీనికి మహేష్, శ్రీధర్ సహకరిస్తున్నారు. వీటిని సాహిల్ హోల్‌సేల్‌గా ఫారూఖ్‌కు చెందిన ఆటోలో సరఫరా చేస్తున్నాడు. ఖాలీద్ తదితరుల పొగాకు ఉత్పత్తులు సరఫరా చేసేవారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువా రం దాడి చేసి ఖాలిద్ మినహా ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు లక్షల విలువైన గుట్కా , పొగాకు ఉత్పత్తులతో పాటు రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. -
రేషన్ బియ్యానికి రెక్కలొస్తున్నాయ్..!
ఇల్లెందు(ఖమ్మం): ఇల్లెందు ఏరియాలో రేషన్ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. రేషన్ వినియోగదారుల ఇళ్లలో ని ఈ బియ్యం.. గ్రామం దాటి, మహబూబాద్ వెళుతోంది. ఆ తరువాత కాకినాడకు చేరుతోంది. అక్కడి నుంచి సముద్రం దాటి విదేశాలకు వెళుతోంది. మాణిక్యారంలో పట్టివేత ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామం నుంచి 20టన్నుల రేషన్ బియ్యాన్ని లారీలో ఇద్దరు వ్యక్తులు (రామారావు, నర్సయ్య) తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇల్లెందు పట్టణంలోని చెరువు కట్ట ప్రాంతంలో మాటు వేశారు. రాత్రివేళ అటుగా వచ్చిన ఆ లారీని అడ్డుకున్నారు. విజయవాడకు చెందిన ఏపీ16టీవై 4389 నంబర్ లారీలో మాణిక్యారం గ్రామానికి ఎరువుల బస్తాలు వచ్చాయి. అదే లారీలో బియ్యం తరలిస్తున్నారు. అందులోని 20టన్నుల బియ్యాన్ని స్వా ధీనపర్చుకున్నారు. లారీడ్రైవర్ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. అధికారుల అండదండలు...! ఇల్లెందు ఏరియా నుంచి అర్ధరాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలుతోంది. ఈ దందా వెనుక సంబంధిత అధికారుల హస్తం కూడా ఉందని, దీనికి ప్రతిగా వారికి దండిగానే డబ్బు ముడుతోందని సమాచారం. నెల రోజుల్లో నాలుగు లారీల్లో రేషన్ బియ్యం తరలించారు. ఇల్లెందు, గార్ల, సత్యనారాయణపురం, మాణిక్యారం కేంద్రాలుగా ఈ దందా సాగుతోంది. ఐదారుగురు సభ్యులున్న నాలుగు ముఠాలు ఇలా బియ్యం తరలిస్తున్నాయి. ప్రతి నెల 1వ నుంచి 20వ తేదీ వరకు ఈ ముఠాలు గ్రామాల్లో కేజీ రేషన్ బియ్యాన్ని నాలుగు నుంచి ఆరు రూపాయల చొప్పున కొని ఒకచోట నిల్వ చేస్తున్నాయి. డోర్నకల్,మహబూబాబాద్‌లోని రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి 25 కిలోల సంచుల్లో ప్యాకింగ్ చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. తాజాగా, మాణిక్యారం గ్రామం వద్ద 20 టన్నుల బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. 15 రోజుల ముందు కూడా ఇదే గ్రామం నుంచి మూడు లారీల బియ్యాన్ని మహబూబాబాద్‌కు తరలించారు. సత్యనారాయణపురం గ్రామం నుంచి ట్రాక్టర్ల ద్వారా నిజాంపేట అటవీ ప్రాంతంలోని రహస్య ప్రదేశంలోకి చేర్చారు. అక్కడి నుంచి వాహనంలో మహబూబాబాద్‌కు తరలించారు. గార్ల మండలానికి చెందిన ఒక ముఠా, మాణిక్యారం గ్రామానికి చెందిన ఇంకొక ముఠా, సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మూడు ముఠాలు ఇలా బియ్యం తరలిస్తున్నాయి. వీరు స్థానికంగా కిలో నాలుగు నుంచి ఆరు రూపాయలకు కొని, మహబూబాబాద్‌లోని మిల్లర్లకు పది రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ మిల్లర్లు రీసైక్లింగ్ చేసి కిలో 20 రూపాయల చొప్పున కాకినాడలో విక్రయిస్తున్నారు. ప్రతి నెల 1 నుంచి 20వ తేదీ వరకు ఈ దందా సాగుతోంది. ఇన్ని ముఠాలు ఇంత యథేచ్ఛగా, దర్జాగా బియ్యం సేకరిస్తుంటే.. తరలిస్తుంటే సివిల్ సప్లై శాఖకు తెలియడం లేదా...? తెలిసినా పట్టించుకోవడం లేదా..? కావాలనే పట్టుకోవడం లేదా...? ఈ అక్రమ దందాకు వారి సహకారం కూడా ఉందా...? ఇన్ని ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ప్యాసింజర్ రైలులో పట్టివేత మధిర: ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ప్యాసింజర్ రైలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు మంగళవారం మధిరలో పట్టుకున్నారు. నాగులవంచ రైల్వేస్టేషన్లో ముగ్గురు మహిళలు రేషన్ బియ్యాన్ని ప్యాసింజర్ రైల్లో మొత్తం 16 బియ్యం మూటలను ఎక్కించారు. దీనిని సివిల్ సప్లై జిల్లా పర్యవేక్షక కమిటీ సభ్యుడు వేమిరెడ్డి రోసిరెడ్డి గమనించారు వివరాలు అడుగుతుండగానే ఆ ముగ్గురు మహిళలు పరారయ్యారు. ఆ మూటలను మధిర రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులకు, పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ జిల్లా అధికారి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆ బియ్యాన్ని రైల్వే పోలీసుల నుంచి సివిల్ సప్లై అధికారులు స్వాధీనపర్చుకున్నారు. కార్యక్రమంలో మధిర రైల్వే స్టేషన్ మాస్టర్ ఆర్వి.కాశిరెడ్డి, జీఆర్పీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ప్లాట్‌ఫాం టీసీ ఎస్ఎస్ కిషోర్‌బాబు, పాయింట్స్‌మెన్ రమణ, తూములూరి మనోజ్ పాల్గొన్నారు. -
నిఘా లేక దగా
బియ్యం అక్రమ రవాణాకు జిల్లా అడ్డాగా మారింది. తెలంగాణలోని ఖమ్మం, ఇతర ప్రాంతాలతో పాటు జిల్లాలోని రేషన్‌డిపోల నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని సేకరించి, వాటిని పాలిష్ పట్టించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత రెండు రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న దాడుల్లో రైసుమిల్లుల వద్ద పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దొరుకుతుండటం సంచలనంగా మారింది. 24 గంటల వ్యవధిలో తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారం శ్రీ శ్రీనివాసా ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రైస్ మిల్లులో నాలుగు కోట్ల డబ్భై ఆరు వేల రూపాయల విలువ గల మొత్తం స్టాకును స్వాధీనం చేసుకోగా, తాజాగా నల్లజర్ల మండలం అనంతపల్లి శ్రీ వెంకట సత్యనారాయణ రైస్ అండ్ ఫ్లోర్ మిల్లో సోమవారం ఉదయం దాడులు నిర్వహించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఖమ్మం జిల్లా నుంచి పలు రేషన్ డీలర్లు, ప్రజల వద్ద సేకరించిన రేషన్ బియ్యాన్ని మినీ వ్యాన్‌లో జిల్లాలోని ఆనంతపల్లి రైస్ మిల్లుకు తరలించి దిగుమతి చేస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఓ మినీ వ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లులో ఉన్న స్టాకు నిల్వల్ని కూడా అధికారులు తనిఖీలు చేశారు. స్టాకుల్లోనూ వ్యత్యాసాలు గుర్తించారు. 298 క్వింటాళ్ల ధాన్యం, 11 క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసాలు ఉన్నట్లుగా లెక్క తేల్చారు. ఈసారి 6ఎ తోపాటు 7(1) లెవీ ఆర్డర్స్ రూల్ అతిక్రమణగా కేసులుగా నమోదుచేసి రైస్ మిల్లును విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. పేదలకు రేషన్ డిపోల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి, అక్కడ నుంచి బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రేషన్‌షాపుల నుంచి, లబ్ధిదారులను మభ్యపెట్టి కేజీ రూ.10కి కొనుగోలు చేసి వీటిని రీసైక్లింగ్ చేసి కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రతినెలా లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 5కేజీల చొప్పున రేషన్ బియ్యం ఇస్తుంది. నలుగురు ఉన్న కుటుంబానికి కేజీ రూ.1కు 20 కేజీల వరకు నెలకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే ఎక్కువ మంది ఈ బియ్యాన్ని వాడటానికి ఆసక్తి కనపరచకపోవడంతో లబ్ధిదారులకు కిలోకు రూ.10 చొప్పున చెల్లించి ఆ బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని అక్రమార్కులు ఆటోల ద్వారా గోడౌన్లకు తరలించి, ఒక లారీ లోడు సిద్ధమయ్యాక పలు రైస్‌మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్ చేసి ఏదో ఒక బ్రాండ్ పేరుతో 25 కేజీల బ్యాగ్ తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన రైస్బ్యాగ్లను కాకినాడ పోర్టు నుంచి బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలోని రేషన్‌షాపుల నుంచే కాక జిల్లా సరిహద్దు తెలంగాణ గ్రామాల పరిధిలోని రేషన్‌షాపుల నుంచి కూడా బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెం, చింతలపూడి, జీలుగుమిల్లి, టి.నరసాపురం తదితర ప్రాంతాల్లో విజిలెన్స్అధికారులు దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకోగా తాజాగా తాడేపల్లిగూడెం, నల్లజర్లలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గతంలో రెవెన్యూ విజిలెన్స్ అధికారులు అక్రమార్కులపై దాడులు చేసినా కేవలం 6ఎ కేసుతో సరిపెట్టడంతో ఈ కేసుల నుంచి బయటపడి వెంటనే మళ్లీ ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఒక్కొక్కరిపైనా 10 నుంచి 15 కేసులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఈ అక్రమ వ్యాపారాన్ని మానడం లేదు. ఈసారి కలెక్టర్ ఆదేశాల మేరకు 6ఎతో పాటు 7(1) సెక్షన్ కింద కేసులు పెట్టడంతో అక్రమ రవాణాదారుల్లో కలకలం రేగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటికైనా రైస్‌మిల్లులపై దృష్టి పెడితే ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
‘కమాండ్ కంట్రోల్’.. అనుసరణీయం
కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ జాయింట్ సెక్రటరీ దీపక్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’కు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ జాయింట్ సెక్రటరీ దీపక్‌కుమార్ కితాబిచ్చారు. ఒక రోజు పర్యటనలో భాగంగా మంగళవారం కమాండ్ సెంటర్‌ను పరిశీలించిన దీపక్ కుమార్.. గోదాముల నుంచి రేషన్ షాపుల వరకు సరుకులు చేరే కదలికలను ఈ కేంద్రం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాటు చేయడం బాగుందన్నారు. మండల స్థాయి నిల్వ కేంద్రాల (ఎంఎల్ఎస్ పాయింట్లు) వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, సరుకులు తరలించే లారీలకు జీపీఎస్ అనుసంధానం విధానాలు అనుసరణీయమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేస్తానని చెప్పారు. రేషన్ సరుకులు లబ్ధిదారుడికి చేరే వరకు అడుగడుగునా నిఘా ఉంచేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ వివరించారు. కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా బియ్యం తరలింపును ఈ సెంటర్ ద్వారా నిరోధించగలిగామని చెప్పారు. తెలంగాణలో ఈ–పాస్ విధానం అమలు ఎంతవరకు వచ్చిందని అధికారులను దీపక్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. నగదు రహిత లావాదేవీల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో ఈ–పాస్ మిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, జూన్ నాటికి ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషనర్ ఆనంద్ చెప్పారు. గత ఖరీఫ్‌లో 4 లక్షల మంది రైతుల నుంచి 16.45 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా రూ.2,500 కోట్లు చెల్లింపులు జరిపామన్నారు. సమావేశంలో సీఆర్ఓ బాలమయదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆగని బియ్యం దందా
పీడీఎస్ బియ్యం సేకరణపై అనుమానాలు నెలకోసారి పట్టివేత డీలర్లే ప్రధాన సూత్రధారులు హసన్‌పర్తి : పేదలకు చెందాల్సిన బియ్యం పక్కాదారి పడుతున్నాయి. అక్రమార్కులపై కేసులు నమోదు చేసినా బియ్యం దందా ఆగడం లేదు. నాలుగు నెలలుగా బియ్యం వ్యాపారులపై నాలుగు కేసులు నమోదైనా మళ్లీ అదే మార్గం పట్టారు. 40 రోజుల క్రితం ఇదే ముఠా హుస్నాబాద్‌లో లారీలతో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15 రోజుల్లో మళ్లీ వారు సుమారు 80 క్వింటాళ్ల బియ్యం సేకరించి అధికారులకు చిక్కారు. ఆ తర్వాత నెల తిరగకముందే శనివారం మళ్లీ 80 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని స్వయంగా లబ్ధిదారుల నుంచే కొనుగోలు చేసి.. రెండుమూడు రూపాయలకు ఎక్కువగా అమ్ముకుంటున్నామని నిందితులు చెబుతున్న మాటల్లో స్పష్టత లేదు. బియ్యం సేకరణపై అనుమానాలు.. రేషన్ బియ్యం దందా చేసే వారు పేర్కొంటున్న విధంగా బియ్యం సేకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూలీలకు వెళ్లేవారు. ఈ బియ్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే కార్డులు కలిగిన మధ్యతరగతి వర్గాలు మాత్రం రేషన్‌షాపుల నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. కొందరైతే నెలవారీగా బియ్యం తీసుకెళ్లడం లేదు. ఈ బియ్యాన్ని సదరు డీలర్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌షాపుకు వచ్చే క్రమంలోనే లారీని మధ్యలోనే నిలిపివేసి.. బియ్యాన్ని కొంతమంది డీలర్లు అమ్ముతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా నిందితుల మాత్రం అధికారులకు మరోలా వాంగ్మూలం ఇస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఉల్లిగడ్డలు విక్రయించి.. అందుకు బదులుగా బియ్యం తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. హసన్‌పర్తిలో మరో రెండు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో రేషన్ బియ్యం దందా నడుస్తున్నా అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
40 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
మాచర్ల: పట్టణ శివారులోని రాయవరం జంక్షన్లో ఆదివారం ఉదయం జిల్లా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రెండు టాటా ఏసీ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీన పర్చుకున్నారు. మాచర్లకు చెందిన ఇద్దరు రేషన్ బియ్యం వ్యాపారులు అక్రమంగా తరలించేందుకు వెల్దుర్తి మండలంలోని మండాది, ఉప్పలపాడు గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ వంశీధర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. రెండు వాహనాల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించగా బియ్యాన్ని ఓరుగంటి మోహన్‌రెడ్డి, జమ్మలమడకకు చెందిన గంగనబోయిన శ్రీనివాసరావు తరలిస్తున్నారని సమాధానమిచ్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. వాహనాలను రూరల్ పోలీసులకు అప్పగించి, బియ్యాన్ని ఆర్.ఐ శ్రీధర్‌కుమార్, వీఆర్వోలకు అప్పగించామన్నారు. దాడిలో విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘చౌక’చక్యంగా తరలింపు
చీరాల, న్యూస్‌లైన్: పేదల బియ్యాన్ని భోంచేసే వ్యాపారులు తమ అక్రమ వ్యాపారానికి సరికొత్త పంథా ఎంచుకున్నారు. ‘ట్రాక్టర్లు, ఆటోలు, లారీల్లో చౌక బియ్యం తరలిస్తుంటే అందరికీ అనుమానం వస్తుంది. అధికారులు దాడులు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇన్ని బాధలు లేకుండా ఏంచేయాలి’ అని ఆలోచించారు. వెంటనే ‘ఐడియా’ అని అరిచారు. టీవీఎస్ మోపెడ్లను లైన్లో పెట్టారు. కొంతమంది వ్యక్తులను కూలీకి కుదుర్చుకుని మోపెడ్లపై నుంచి బియ్యం తరలించడం మొదలు పెట్టారు. ఈ దందా చీరాల, వేటపాలం, చినగంజాం ప్రాంతాల్లో హెచ్చు మీరుతోంది. రేషన్ దుకాణాల నుంచి బియ్యం తరలించే కార్యక్రమాన్ని ఓ నెలలో 15 వ తేదీ లోగా పూర్తి చేస్తున్నారు. ఈ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా.. అనుమానం రాకుండా బియ్యాన్ని ప్లాస్టిక్ గోతాల్లో పెట్టి కట్టేస్తున్నారు. ఓ మోపెడ్‌పై రెండు గోతాల చొప్పున ఉంచి మిల్లులకు తరలిస్తున్నారు. ఇలా ఒక్కో వాహనం ద్వారా రోజుకు నాలుగైదు ట్రిప్పులుగా బియ్యాన్ని చేరవేస్తున్నారు. మొత్తంమీద 20 మోపెడ్లు అక్రమ రవాణాలో పాలుపంచుకుంటున్నాయి. ఈ తరహా తరలింపుపై ఎవరి దృష్టీ పడకపోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఈ బియ్యాన్ని బాపట్లలోని మిల్లులకు తరలించిన తర్వాత.. రీసైక్లింగ్ చేస్తూ ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. దేశాయి పేట గోడౌన్ కీలకం.. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని తెల్లకార్డుదారుల కోసం నెలకు వెయ్యి టన్నుల రేషన్ బియ్యం దేశాయిపేటలోని గోడౌన్‌కు చేరుతుంది. అయితే అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. వివిధ మార్గాల్లో బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మొత్తం బియ్యంలో 600 టన్నుల దాకా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నాయి. డీలర్ల వద్ద నుంచి కిలో *10 కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. మిల్లర్లకు *13 చొప్పున విక్రయిస్తున్నారు. అధికారులు ఎందుకు ఉన్నట్లు? డీపోల నుంచి పట్టపగలే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం మమ అనిపిస్తున్నారు. అక్రమార్కుల నుంచి పెద్ద ఎత్తున మామూళ్లు అందుతుండడంతో మెతక ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చలించడంలేదు. గతంలో 6ఏ కేసులు నమోదు చేసేవారు.. ఇప్పుడు సాహసించకపోవడం గమనార్హం. దీంతో పాత వ్యాపారులతో పాటు కొత్తవారు కూడా అక్రమ వ్యాపారానికి దిగారు. ప్రాంతాల వారీగా రేషన్ డిపోలను పంచుకున్నారు. మోటుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి అధికార పార్టీ అండదండలను చూసుకొని పెట్రేగిపోతున్నాడు.