కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రి అనస్థీషియన్ అరుణకుమారిపై గురువారం రోగి బంధువులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా శుక్రవారం ఉదయం సిబ్బంది, పీజీ విద్యార్థులు, వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
వారంతా తదుపరి నిరసన కార్యక్రమాలపై ఆస్పత్రి ప్రాంగణంలో సమావే శమై చర్చిస్తున్నారు. అయితే, ఓపీ సేవలు నిలిచిపోవటంతో పెద్ద సంఖ్యలో రోగులు ఆస్పత్రి వద్ద వేచి చూస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు.