నిమ‘జ్జనం’లో పోకిరీ వేషాలు | she team cached 26 youngsters in teasing cases | Sakshi
Sakshi News home page

నిమ‘జ్జనం’లో పోకిరీ వేషాలు

Published Fri, Sep 16 2016 11:21 PM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

she team cached 26 youngsters in teasing cases

సాక్షి, సిటీబ్యూరో: నిమజ్జనం నేపథ్యంలో గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో యువతులు/మహిళల్ని వేధిస్తున్న 26 మంది పోకిరీలను షీ–టీమ్స్‌ పట్టుకున్నాయి. వీరిలో ఏడుగురు మైనర్లు సైతం ఉన్నారని అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా శుక్రవారం పేర్కొన్నారు. పోకిరీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రధాన ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు నగరంలోని కీలక ప్రాంతాలు, హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల షీ–టీమ్స్‌ను రంగంలోకి దింపి డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించారు. ఫలితంగా వీరంతా చిక్కారు. ఈ పోకిరీల చేష్టలను వీడియో రికార్డింగ్‌ చేయడం ద్వారా అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement