తాడేపల్లిలో తళుక్కుమన్న సింధు
తాడేపల్లి రూరల్: రియో ఒలింపిక్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు సోమవారం తాడేపల్లి బైపాస్ రోడ్డులో ఉన్న వి.ఆర్. అపార్టుమెంట్‌కు వచ్చారు. అక్కడ ఉన్న తన బంధువుల ఇంట సుమారు గంటసేపు గడిపారు. చుట్టుపక్కల ఉన్న మహిళలు, యువతులు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఫ్లాట్‌కు చేరుకుని పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సింధు తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వెళ్లారు.